గ‌ర్ల్స్ ని ఎలా ప‌డేయాలో కొన్ని టిప్స్ ఇవ్వు బ్రో!

Update: 2021-04-22 03:30 GMT
ర‌ష్మిక‌తో విజ‌య్ నిండా ప్రేమ‌లో మునిగాడు! అంటూ ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది. నిజానికి ర‌ష్మిక‌కు మోకాళ్ల‌పై(ఒంటి కాలు) నిలిచి ప్ర‌పోజ్ చేసిన ప్ర‌క‌ట‌న‌తోనే ఈ ర‌చ్చంతా. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంది అంటూ గీత గోవిందం స‌మ‌యం నుంచి గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్పుడు అవి మ‌రింత‌గా రాజుకున్నాయి. ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన ప్ర‌తిసారీ ఏదో ఒక గ‌డ‌బిడ మొద‌ల‌వుతూనే ఉంది.

అయితే ర‌ష్మిక‌తో విజ‌య్ స్నేహం గురించి అర్థం చేసుకున్న‌వాళ్లు త‌క్కువ‌. ఇది ప్రేమో మాయో కాదు కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. అదంతా స‌రే కానీ.. మెస్ 2 అంటూ ప‌డ‌క‌గ‌దిలో హాయిగా నిద్ర‌లోకి జారుకున్న ఓ ఫోటోని విజ‌య్ షేర్ చేశారు. దానికి బోయ్స్ నుంచి స్పంద‌న‌లు ఆ రేంజులోనే ఉన్నాయి.

మామా నీకేంటి ఎలా అయినా ఫోజులిస్తావ్.. లైఫ్ ని ఎంజాయ్ చేస్తావ్!! అంటూ ఒక అభిమాని రిప్ల‌య్ ఇచ్చాడు. వేరొక అభిమాని `గ‌ర్ల్స్ ని ఎలా ప‌డేయాలో కొన్ని టిప్స్ ఇవ్వు బ్రో!` అంటూ అడిగాడు. ఇక ఓ గాళ్ ఫ్యాన్ అయితే.. ఏకంగా విజ‌య్ పై క‌విత‌లే అల్లింది. నీ టీఆర్పీయే నీ ముఖంలో అమాయ‌క‌త్వం.. లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ల‌వ్! అంటూ ట్వీట్ చేసింది ఆ అభిమాని. మొత్తానికి అలా శ‌య‌నించి ఇలా ఇంత‌మందికి కంటిపై కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తున్నాడు విజ‌య్. నిజానికి క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల షూటింగుల్లేక ఖాళీగా ఇలా నిదుర‌పోతున్నాన‌నేది అత‌డి ఉద్ధేశం కావొచ్చు. కానీ అదేమీ ప‌ట్టించుకోకుండా ఫ్యాన్స్ అత‌డి వేరొక కోణాన్ని మాత్ర‌మే ట‌చ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌డు పూరి ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News