రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ మద్య కాలంలో హీరోలు నిర్మాతలుగా మారడం కామన్ విషయం. కాని అతి తక్కువ సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ కూడా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పుష్పక విమానం సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించాడు. ఏదో నిర్మించాం.. వదిలేశాం అన్నట్లుగా కాకుండా విజయ్ దేవరకొండ పుష్పక విమానం సినిమా షూటింగ్ మొదలుకుని ప్రమోషనల్ ఈవెంట్స్ మరియు విడుదల విషయం అన్నింట్లో కూడా చాలా యాక్టివ్ గా పాలు పంచుకుంటున్నాడు. ఒక వైపు లైగర్ సినిమా వ్యవహారాలతో బిజీగా ఉన్నా కూడా పుష్పక విమానం కోసం టైమ్ కేటాయిస్తున్నాడు.
ఇప్పటికే తమ్ముడు ఆనంద్ తో కలిసి ఒక చిట్ చాట్ వీడియో చేసి దాన్ని విడుదల చేసిన విజయ్ దేవరకొండ తాజాగా మరో సారి తమ్ముడితో కలిసి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేయడం జరిగింది. తాజాగా ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ దేవరకొండ మాట్లాడిన వీడియో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ త్వరలో వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎవడే సుబ్రమణ్యం సమయంలో దామోదర ఒక స్టోరీ లైన్ చెప్పాడు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు దాన్ని వెబ్ సిరీస్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహార్ ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను అందుకునే విధంగా లైగర్ సినిమా ఉంటుందా అనేది చూడాలి. మరో వైపు సుకుమార్ తో విజయ్ దేవరకొండ ఒక సినిమాను కన్ఫర్మ్ చేశాడు. అంతకు ముందే శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను చేయడం కోసం ప్రకటన వచ్చింది. మొత్తానికి వరుస సినిమాలు.. వెబ్ సిరీస్ లతో రౌడీ స్టార్ రాబోయే రెండు మూడు ఏళ్లు ఫుల్ బిజీ అవ్వబోతున్నాడు.