ఎస్.ఎస్.రాజమౌళి బృందం RRR పాత్రల్ని, పాత్రధారుల వివరాల్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని వెల్లడించారు. ఆ ఇద్దరూ వీరులు కాకముందు ఏం చేశారు? సమర యోధులయ్యేందుకు ఎలా ప్రిపేరయ్యారు? అన్న కథతో సినిమా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఆ ఇద్దరి కలయికను ఫిక్షనల్ గా చూపిస్తున్నామని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. దాంతో పాటే ఆ ఇద్దరు కథానాయికల్ని ప్రకటించారు. రామరాజు చరణ్ సరసన సీతగా ఆలియాభట్ నటిస్తుంటే, కొమరం భీమ్ తారక్ సరసన నాయికగా హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని రాజమౌళి ప్రకటించారు.
ఆ ప్రకటనకు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ ఎంతో ఎగ్జయిటింగ్ గా స్పందించింది. దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ లతో కలిసి పని చేసే అవకాశం, అదృష్టం తనకు దక్కినందుకు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఆలియా పాపులారిటీ అమాంతం పెరిగింది. ఇంతకాలం ఉత్తరాది ఫ్యాన్స్ మాత్రమే తనకు అండగా నిలిస్తే, ఇకపై సౌత్ లోని రామ్ చరణ్ అభిమానులు తన ఖాతాలో పడిపోయారు. ఇన్ స్టాగ్రమ్, ట్విట్టర్ లో ఫాలోవర్స్ గా మారిపోయారు. నాటి నుంచి ఆలియా ఏ అప్ డేట్ పెట్టినా దానికి రిప్లయ్ లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా ఆలియా క్రేజు ఇటు సౌత్ లోనూ పెరిగింది. ఇక నిరంతరం ఆలియా గురించి తలచి తలచి తెలుగు మీడియా తరిస్తోంది. దాని వల్లనా ఆలియా ఇమేజ్ ఇక్కడ పెరిగింది.
మరోవైపు హాలీవుడ్ వెబ్- టీవీ సిరీస్ బ్యూటీ డైజీ ఎడ్గార్ జోన్స్ సన్నివేశమేంటి? అంటే ఈ అమ్మడు మాత్రం ఆర్.ఆర్.ఆర్ గురించి సరైన అవేర్ నెస్ లేకపోవడం వల్ల వెంటనే సరిగా స్పందించలేదు. తనకు తారక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఎంతగా చేరువవ్వాలని చూసినా తను పట్టించుకోవడం లేదు. `వెల్ కం టు టాలీవుడ్ జోన్స్`, జై ఎన్టీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో నినాదాలు చేస్తున్నారు. అయితే ఎడ్గార్ కి మన కల్చర్ అర్థమయ్యేందుకు కాస్తంత సమయం పడుతుందనే భావించాలి. ఇప్పటికైతే ఆలియా - డైజీలకు చరణ్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులైపోయారు. ట్విట్టర్ - ఇన్ స్టాలో ఆ ఇద్దరికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చరణ్ - తారక్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు ఆ ఇద్దరు భామలకు అభిమానులు అన్నమాట!! క్రేజీ క్రేజీ బ్యూటీస్.. క్రేజీ ఫాలోయింగ్..! అదీ సంగతి!!