శాకుంత‌లంతో పోటీకొస్తున్న RRR సీత‌..!

Update: 2021-03-14 16:39 GMT
సోమ‌వారం ఉద‌యం రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.  స‌రిగ్గా 8ఏఎం ఆ రెండిటి ముహూర్తాలు ఫిక్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఒక‌టి గుణ‌శేఖ‌ర్ - స‌మంత కాంబినేష‌న్ మూవీ శాకుంత‌లం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా మ‌హ‌మ్మారీ భ‌యాలు తొల‌గ‌డంతో ఈ ఉత్స‌వానికి భారీగానే అతిథులు రానున్నార‌ని తెలిసింది.

ప‌నిలో ప‌నిగా అదే స‌మ‌యానికి ఆర్.ఆర్.ఆర్ నుంచి సీత పోస్ట‌ర్ ట్రీటివ్వ‌నుంద‌ని కొద్దిసేప‌టి క్రితం టీమ్ ప్ర‌క‌టించింది. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సీత ప్రీలుక్ ని రివీల్ చేయ‌గా ఉత్కంఠ‌ను పెంచింది. ఇందులో ఆలియా లుక్ ఎంతో ముగ్ధ‌ మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది. సీత అంటే నాటి సెన్సిటివిటీతో అంద‌మైన చీర జాకెట్ తో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించ‌నుంది. అశోక వ‌నంలో శ్రీ‌రాముని కోసం వేచి చూసే సీత గా ఆలియా క‌నిపిస్తోంది ఈ లుక్ లో. ఆస‌క్తిక‌రంగా శాకుంత‌లం లుక్ కూడా ఇంతే ట్రెడిష‌న‌ల్ గా ఉంటుంద‌ని ఇంత‌కుముందు మోష‌న్ పోస్ట‌ర్ తో గుణ హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిన‌దే.

ఇంత‌కుముందే ఆర్.ఆర్.ఆర్ నుంచి సీతారామ‌రాజు.. కొమ‌రం భీమ్ లుక్ లు రివీల్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఇక‌పై క‌థానాయిక‌ల లుక్ లు లాంచ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఆలియా లుక్ త‌ర్వాత ఒలీవియా కొత్త లుక్ కూడా రివీల్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News