#RRR ఏపీ నైజాం థియేట్రికల్ బిజినెస్

Update: 2020-02-07 06:21 GMT
2020 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ పై భారీ బెట్టింగ్ న‌డుస్తోందా? అంటే అవున‌నే స‌మాచారం. ఈ సినిమాపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. బాహుబ‌లి డైరెక్ట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగా ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ క్రేజు నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంద‌ట‌.

గ‌త కొద్ది రోజులు గా కేవ‌లం తెలుగు రాష్ట్రాల నుంచే 400 కోట్ల మేర రాబ‌ట్టాల‌ని రాజ‌మౌళి- దాన‌య్య టీమ్ ప్ర‌ణాళిక‌ల్లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. కొంద‌రు అడ్వాన్స్ డ్ గా కొన్ని లెక్క‌ల్ని ఏరియా వైజ్ ఇవీ అంటూ ప్ర‌చారం చేశారు. అయితే అందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. తాజాగా కొన్ని క్లియ‌ర్ క‌ట్ గ‌ణాంకాలు రివీల‌య్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే... నైజాం - 75 కోట్లు.. సీడెడ్ - 40 కోట్లు... తూర్పు - 18 కోట్లు.. వెస్ట్ -13 కోట్లు.. వైజాగ్ - 25 కోట్లు.. నెల్లూరు - 9 కోట్లు.. గుంటూరు - 18 కోట్లు.. కృష్ణ - 15 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఏపీ- నైజాం క‌లుపుకుని 213 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగింద‌ని తెలుస్తోంది. అంటే ఆ మేర‌కు షేర్ వ‌సూళ్ల‌ను ఆర్.ఆర్.ఆర్ థియేట‌ర్ల నుంచి తేవాల్సి ఉంటుంది. ఇక ఓవ‌ర్సీస్.. బెంగ‌ళూరు.. ఇత‌ర భార‌త‌దేశం లో ఏ మేర‌కు బిజినెస్ సాగించ‌నుంది అన్న లెక్క‌లు తెలియాల్సి ఉంది. శాటిలైట్ - డిజిట‌ల్ - ఆడియో స‌హా ర‌క‌ర‌కాల మార్గాల్లో ఆర్.ఆర్.ఆర్ పై భారీ బెట్టింగ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ - రామారావు - రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీగా ఇప్ప‌టికే నెల‌కొన్న క్రేజు దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు నెల‌కొల్ప‌నుంది? అన్న ఆస‌క్తి ట్రేడ్ లో ఉంది. ఇక ఈ చిత్రం 2021 సంక్రాంతి కి రిలీజ్ కానుంద‌న్న ప్ర‌చారం సాగడం అభిమానుల్ని నిరాశ‌ ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. నిర్మాణానంత‌ర ప‌నుల్లో క్లారిటీ రానందునే ఈ వాయిదా అన్న మాటా వినిపిస్తోంది.
Tags:    

Similar News