టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించిన ఈ సినిమాను జపాన్ లో ఇటీవలే స్థానిక భాషలో విడుదల చేయడం జరిగింది.
జపాన్ లో ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు మరియు హీరోలు వెళ్లారు. అక్కడ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. మొదటి రెండు మూడు రోజులు సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మెల్ల మెల్ల గా సినిమా కలెక్షన్స్ పెరిగాయి.
అనూహ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఈ ఏడాదిలో విడుదల అయిన మేటి జపాన్ సినిమాల జాబితాలో నిలిచింది. హాలీవుడ్ సినిమాలు జపాన్ లో భారీ ఎత్తున విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అక్కడ విడుదల అయిన హాలీవుడ్ సినిమాల సరసన మన ఆర్ ఆర్ ఆర్ సినిమా నిలిచింది అంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
జపాన్ లో ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబిత తీస్తే అందులో ఆర్‌ఆర్ఆర్ సినిమా మూడవ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద మొత్తంలో లాభం దక్కినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ తాజాగా ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న ఈ సినిమా ముందు ముందు మరింత గౌరవం ను ఇండియన్ సినిమాకు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.