కొన్ని బ్రాండ్స్ ఉంటాయి.. లోపల సరుకు ఎలా ఉందో కూడా చూడకుండా.. ఆ బ్రాండ్ లోగో చూసి కొనేస్తారు జనాలు! ఎందుకంటే.. ఆ సరుకు మీద వారికి అంత నమ్మకం. అందుకే.. కళ్లు మూసుకొని కొనేస్తారు కస్టమర్లు! అలాంటి ఒక బ్రాండే రాజమౌళి లోగో. సినిమా పోస్టర్ మీద ఆ లోగో కనిపిస్తే చాలు.. బాక్సాఫీస్ బద్ధలైపోద్దనే నమ్మకం క్రియేట్ అయిపోయింది. అందుకే.. ఆ బ్రాండ్ ను కళ్లు మూసుకొని కొనేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్.
రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ RRR. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇది ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. సినిమా బిజినెస్ మెన్లలో కూడా ఉంది. అందుకే.. RRR ప్రీ-రిలీజ్ తారస్థాయిలో ఉన్నట్టు సమాచారం. రిజల్ట్ విషయం ఎలా ఉంటుందోగానీ.. ముందుగా సినిమాను సొంతం చేసుకునేందుకు మాత్రం ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు!
తెలుగులో ఈ పోటీ మామూలే.. కానీ, ఇతర భాషల్లోనూ ఈ స్థాయి పోటీ నెలకొనడం విశేషం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. కోలీవుడ్ లో ఈ మూవీకి భారీ రేటు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట! అందుతున్న అప్డేట్ ప్రకారం.. రజనీ ‘2.0’ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ RRR తమిళ వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అది కూడా ఆషామాషీ రేటుకు కాదు.. ఏకంగా రూ.45 కోట్లు చెల్లించి ఈ హక్కులు తీసుకుంటోందట ఆ సంస్థ. ఇది బాహుబలి-2 కు సమానం. ఇంత రేటు పెట్టడానికి కేవలం రాజమౌళి బ్రాండ్ మాత్రమే అన్నది నిర్వివాదాంశం. అంతేకాదు.. ఈ సినిమా తెలుగు గడ్డకు సంబంధించిన చారిత్రక అంశాలతో తెరకెక్కుతోంది కాబట్టి.. తమిళ్ ప్రేక్షకులు అంత క్యూరియాసిటీతో చూసే ఛాన్స్ కూడా లేదు. కానీ.. కేవలం రాజమౌళి దర్శకుడు కాబట్టి, ఆ సినిమా చూస్తారనే నమ్మకంతోనే ఇంత మొత్తం పెడుతోందట లైకా!
మరి, ఇంత భారీ ఖర్చు పెట్టిన సంస్థకు ఆ మొత్తం తిరిగి రావాలంటే.. ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ కొట్టాలో చెప్పాల్సిన పనిలేదు కదా! దసరా కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి, రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.