బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ వరుసగా సినిమాలను నిర్మించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఈ ఏడాది ఆరంభంలో ఒక వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన ఆమద్య థక్త్ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. రణవీర్ సింగ్.. కరీనా కపూర్ జోడీగా విక్కీ కౌశల్ మరియు జాన్వీ కపూర్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ కమర్షియల్ స్టార్ డైరెక్టర్ నుండి ఒక ప్రేమ కథ సినిమా రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ మరియు ఆలియా భట్ లు నటించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచే విధంగా దర్శకుడు కరణ్ జోహార్ వరుస ట్వీట్స్ చేశాడు.
టైటిల్ ను బట్టి ఇది ఒక ప్రేమ కథ అనుకుంటున్నారు. ఔను ఇది ఒక ప్రేమ కథనే అయితే ఇప్పటి వరకు మీరు రెగ్యులర్ లైఫ్ లో చూసిన ప్రేమ కథ కాదు. రాకీ మరియు రాణిల ప్రేమ కథ చాలా విభిన్నంగా ఉండి మీ జర్నీ వెనక్కు తీసుకు వెళ్తుందనే నమ్మకం ఉందంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కరణ్ జోహార్ స్వయంగా ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ వయోకామ్ 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ను అనౌన్స్ చేసిన కరణ్ జోహార్ షూటింగ్ ను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. 2022 లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన ప్రకటించాడు. మొదటి సారి రణవీర్ సింగ్ తో కరణ్ జోహార్ వర్క్ చేయబోతున్నాడు. ఆలియా భట్ తో ఇప్పటికే ఒక సినిమాను చేశాడు.
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న ఆలియా భట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ముంగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు కమిట్ అయ్యింది. కొత్త తరహా ప్రేమ కథను చూపిస్తానంటున్న ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ ఏ మేరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.