కలల్ని కనాలి. అవి భారీగా ఉండాలి. పైసా ఖర్చు చేయకుండా ఉండే కలల విషయంలోనూ పినాసితనం.. పొదుపును పాటించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే.. కలను సాకారం చేసుకోవటానికి మాత్రం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. అలా తాను కన్న కలల్ని సాకారం చేసుకోవటం కోసం దేనికైనా.. ఎంతకైనా వెళ్లే సత్తా ఉన్న టాలీవుడ్ ప్రముఖుల్లో ప్రధమ స్థానంలో నిలుస్తారు రాజమౌళి. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఆయన.. దానికి తర్వాతి లెవల్ కు తీసుకెళ్లేందుకు ఆయన భారీగానే కసరత్తు చేస్తున్నారు.
ఈ ప్రయత్నం బాహుబలితో మొదలైతే.. తాజా ఆర్ఆర్ఆర్ తో తర్వాతి లెవల్ ను చేరుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇటీవల తన ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లో విడుదల చేసిన సందర్భంగా..ఆ చిట్టి దేశంలో బజ్ ను క్రియేట్ చేయటంలో జక్కన్న తన టాలెంట్ ను ప్రదర్శించారని చెప్పాలి. ఇక.. తాజాగా అస్కారం కోసం భారత్ నుంచి పది సినిమాలు ఎంపికైనట్లుగా అధికారికంగా ఒక జాబితా విడుదల కావటం.. అందులో ఆర్ఆర్ఆర్ ఉండటం తెలిసిందే.
తాజాగా చిత్ర పరిశ్రమలో ఒక వార్త సంచలనంగా మారింది. ఆర్ఆర్ఆర్ అస్కార్ బరిలో తన సత్తా చాటేందుకు రాజమౌళి అండ్ టీం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా బడ్జెట్ ప్లానింగ్ చేయటమే కాదు.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం లగాన్ చిత్రానికి అస్కార్ ఖాయమన్న మాట వినిపించినా.. అలాంటిదేమీ జరగలేదు. దీనికి కారణం.. లాబీయింగ్ విషయంలో ఈ చిత్ర టీం యాక్టివ్ గా లేకపోవటం.. బడ్జెట్ అంతంతమాత్రంగానే ఉండటం.
అలాంటి పరిస్థితి ఆర్ఆర్ఆర్ కు లేదంటున్నారు. దీనికి తోడు తన సినిమాను ఎంత శ్రద్దగా.. ప్లాన్ గా తీస్తారో.. తన సినిమాకు హైప్ ను క్రియేట్ చేయటం దగ్గర నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల కురిపించేందుకు అవసరమైన ఎత్తుగడల్ని పక్కగా అమలు చేసే రాజమౌళి తాజాగా తన ఆర్ఆర్ఆర్ కు అస్కార్ అందుకునే ప్రయత్నంలో తలమునకలైనట్లుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రాల కేటగిరిలో 301 చిత్రాలు నిలిచాయి. వాటిని షార్ట్ లిస్టు చేస్తారు. అందులో తుది రౌండ్ కు నామినేట్ అయ్యే చిత్రాల జాబితాను జనవరి 25న ప్రకటిస్తారు. తదుపరి విజేతలను మార్చి 12న ప్రకటన ఉంటుంది.
తుది జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేందుకు వీలుగా అవసరమైన లాబీయింగ్ కు జక్కన్న అండ్ కో ఆరు మిలియన్ యూఎస్ డాలర్లు (రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.50 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. అస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు సంబంధించిన ఓట్లు వేసేందుకు పదివేల మంది వరకు ఉంటే.. వారిలో 9500 మందికి ఓటుహక్కు ఉంటుంది. వీరిలో అత్యధికుల్ని చేరుకోవటం.. తమ సినిమా గురించి చెప్పటం.. దాని విశేషాల్ని వివరించటం.. వారికి ప్రత్యేక లంచ్ లు.. డిన్నర్లు ఏర్పాటు చేయటం..లాంటివెన్నో పనుల్ని చేయాల్సి ఉంటుంది.
వీటన్నింటి కోసం పని చేసే పీఆర్ ఏజెన్సీలు ఉంటాయి. వాటి సాయంతో అస్కార్ కలను నెరవేర్చుకునే ప్రయత్నంకొందరుచేస్తుంటారు.తాజాగా జక్కన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు అవసరమైన బడ్జెట్ ను భారీగా సిద్ధం చేసుకోవటం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరేం జరుగుతుందో కాలం సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఈ ప్రయత్నం బాహుబలితో మొదలైతే.. తాజా ఆర్ఆర్ఆర్ తో తర్వాతి లెవల్ ను చేరుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇటీవల తన ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లో విడుదల చేసిన సందర్భంగా..ఆ చిట్టి దేశంలో బజ్ ను క్రియేట్ చేయటంలో జక్కన్న తన టాలెంట్ ను ప్రదర్శించారని చెప్పాలి. ఇక.. తాజాగా అస్కారం కోసం భారత్ నుంచి పది సినిమాలు ఎంపికైనట్లుగా అధికారికంగా ఒక జాబితా విడుదల కావటం.. అందులో ఆర్ఆర్ఆర్ ఉండటం తెలిసిందే.
అస్కార్ బరిలో ఉత్తమ చిత్రం కేటగిరిలో నిలిచిన 'ఛల్లా షో' అదికారిక ఎంట్రీగా నిలిస్తే.. మిగిలిన తొమ్మిది భారతీయ సినిమాలు మాత్రం ఓపెన్ కేటగిరిలోకి వెళ్లాయి. అలా ఓపెన్ కేటగిరిలో వెళ్లిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. వెళ్లింది ఓపెన్ కేటగిరి అయినా.. తన సత్తా చాటేందుకు రాజమౌళి అండ్ టీం చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదంటున్నారు. ఒక బలమైన పీఆర్ ఏజెన్సీ సాయంతో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.