దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవడంతో ముందుగా చెప్పినట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. 'ఆర్.ఆర్.ఆర్' ని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్ వర్క్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'యమదొంగ' 'మగధీర' 'ఈగ' 'బాహుబలి' సినిమాలలో అబ్బురపరిచే విజువల్స్ అందించారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' లో కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ కి అధిక సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది.
'ఆర్.ఆర్.ఆర్' గ్రాఫిక్ వర్క్స్ కోసం పలు విదేశీ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. 'బాహుబలి' సినిమాని మించేలా విజువల్స్ ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వీఎఫ్ఎక్స్ కోసమే స్పెషల్ బడ్జెట్ కేటాయించారట. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పార్ట్ కంటే వాటికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన టీజర్స్ లో శాంపిల్ విజువల్స్ చూపించాడు జక్కన్న. సినిమా మొత్తం విజువల్ ట్రీట్ లా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీని కారణంగానే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందని టాక్. కాగా, ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అలియా భట్ - ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.