కాలంతో పాటే మారాలి. కానీ ఆచార్య టీమ్ మారినట్టు లేదు. ఇంకా RRR కండీషన్ కి చెక్ పెడుతున్నట్టుగా కనిపించడం లేదు. RRR విడుదలయ్యాకే ఆచార్య రిలీజవ్వాలని పట్టుపట్టడం సరైనదేనా? అన్న చర్చ సాగుతోంది. ఒక పాన్ ఇండియా సినిమాకి కేవలం తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టి తెరకెక్కించిన `ఆచార్య` ఎలా పోటీ అవుతుంది? అన్నది అర్థం కాని వ్యవహారం.
ప్రస్తుత పరిస్థితిలో తెలుగు మార్కెట్ తో పాటు ఉత్తరాది మార్కెట్ ఇతర సౌత్ మార్కెట్లలో విడుదల కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ కోసం ఆచార్య ను వెయిటింగ్ చేయించడం సమర్థనీయమేనా? అంటే విశ్లేషకుల మాట వేరేలా ఉంది. అంతా ఓమిక్రాన్ మహిమ. కాల మహిం. కరోనావైరస్ మూడవ వేవ్ రాకతో జనవరిలో విడుదల కావాల్సిన అన్ని భారీ చిత్రాల విడుదలలు వాయిదా పడ్డాయి. తేదీలు మారాయి. మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అనూహ్య పరిణామమిది. RRR వాయిదాతో టాలీవుడ్ షెడ్యూళ్లకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్న గందరగోళం తలెత్తింది. ముఖ్యంగా ఇది మెగాస్టార్ చిరంజీవి ఆచార్యపై ప్రభావం చూపుతోంది. దానికి కారణం ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాతే ఆచార్య విడుదల చేయాలనే ఒప్పందమే.
RRR చిత్రీకరణలో ఉన్నప్పుడు కొరటాల శివ సహా ఆచార్య నిర్మాతలు ఆ మేరకు ఓకే చెప్పారట. దీనికి కారణం ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ ని చూసిన తర్వాతే ఆచార్యలో చరణ్ ని ఆడియెన్ చూడాలనేది రాజమౌళి కండీషన్ అని గుసగుసలు వినిపించాయి. అందుకే RRR విడుదల తర్వాత మాత్రమే ఆచార్యను విడుదల చేయమని మేకర్స్ ను కోరాడు. రాజమౌళి కండీషన్ కి ఆచార్య టీమ్ సరేనని అంగీకరించింది.
కానీ ఓమిక్రాన్ టెన్షన్ల నడుమ అంతా మారిపోయింది. సంక్రాంతి బరిలో రావాల్సిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో ఆచార్య విడుదల కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడింది. RRR ఎన్నిసార్లు వాయిదా పడితే అన్నిసార్లు ఇదే సన్నివేశం తప్పేలా లేదు. ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ వేసవిలో విడుదలైతే ఆచార్య ఆ తర్వాత మరో బెస్ట్ డేట్ వెతుక్కోవాలి. అయితే RRR తో పెద్ద చిక్కు ఉంది. ఇది దేశం మొత్తం విడుదల కావాల్సి ఉంటుంది. పైగా అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా సహా ఇతర మార్కెట్లలోనూ లైన్ క్లియరవ్వాలి. వైరస్ సమస్య లేకుండా క్లీన్ గా ఉంటేనే ఇదంతా సాధ్యం. అత్యుత్తమ విడుదల కోసం మొత్తం భారతీయ అంతర్జాతీయ మార్కెట్ లు తిరిగి తెరిస్తేనే ఇది సాధ్యం.. ఆచార్యకి తెలుగు రాష్ట్రాలు USA మార్కెట్ మళ్లీ తెరిచి థియేటర్లు రన్ అవ్వాలి. ఇది చాలా సంక్లిష్టమైనది. అందుకే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తో సంబంధం లేకుండా ఆచార్య రిలీజ్ కి జక్కన్న నుంచి అడ్డు తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ప్లాన్ ఛేంజ్ అవుతుందా? అన్నదానికి ఆచార్య టీమ్ క్లారిటీ ఇస్తుందేమో!