యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎన్నాళ్ళ నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా ఈరోజు శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
టాలీవుడ్ లో రెండు పెద్ద ఫ్యామిలీ హీరోలు నటించడం.. అది కూడా ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న స్టార్స్ తో జక్కన్న తీసిన సినిమా కావడంతో RRR పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు ప్రచార చిత్రాల్లో హీరోలిద్దరినీ బ్యాలన్స్ చేస్తూ వచ్చారు.
అయినప్పటికీ ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో పోటీ పడ్డ ఫ్యాన్స్.. RRR రిలీజ్ డే నాడు ప్రత్యక్షంగా ఘర్షణకు దిగారు. గత వారం రోజుల నుంచే థియేటర్స్ వద్ద ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తూ వచ్చారు.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ విడుదల నేపథ్యంలో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలులోని ఓ థియేటర్ వద్ద మెగా - నందమూరి అభిమానుల మధ్య టిక్కెట్ల వివాదం నెలకొంది.
RRR సినిమా టిక్కెట్స్ కోసం ఇరు వర్గాలు అభిమానులు పట్టుపట్టడంతో స్థానిక థియేటర్ వద్ద కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గం ఫ్యాన్స్ తమకే ఎక్కువ టిక్కెట్స్ ఇవ్వాలని పట్టుపట్టడంతో.. మరో హీరో అభిమానులు గొడవకు దిగారు.
ఈ క్రమంలో థియేటర్‌లో తలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాహాబాహీకీ దిగిన ఇరు వర్గాలు వారికి సర్ధిచెప్పి పంచించి వేసారు. అలానే చిత్తూరు జిల్లాలో ఇరు హీరోల అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.
ఇక తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మమతా థియేటర్ యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవ ఉద్రిక్తతలకి దారి తీసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి కావాలనే యాజమాన్యం టికెట్స్ ఇవ్వడం లేదని గొడవకి దిగడంతో మొదలైన రచ్చ చివరికి పరస్పర దాడుల వరకు వెళ్ళింది. తమపై థియేటర్ సిబ్బంది దాడి చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో మాట్లాడి సర్దిచెప్పారు.
ఇకపోతే 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ ఇద్దరు హీరోల అభిమానులు కటౌట్స్ తో ర్యాలీలు నిర్వహించారు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారని ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.