మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆర్.ఆర్.ఆర్` ఇటీవల షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకున్న యూనిట్ పాటల చిత్రీకరణపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్- హైదరాబాద్ లో పాటల షెడ్యూల్ ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తోంది. చరణ్-ఆలియా.. ఎన్టీఆర్ ఒలివియా మోరిస్ లపై పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే జక్కన్న ఉక్రెయిన్ లో తిష్ట వేసి లోకేషన్ల వేటలో పడ్డారు. అయితే ఈ పాటల చిత్రీకరణ కోసం ఫస్ట్ క్లాస్ కొరియోగ్రాఫర్లని రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొరియోగ్రాఫర్ విషయమై చరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. రామ్ చరణ్ జానీ మాస్టర్ ని సూచిస్తే.. ఎన్టీఆర్ - రాజమౌళి శేఖర్ మాస్టర్.. ప్రేమ్ రక్షిత్ లను సూచించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయాలి? లేక ముగ్గురికి అవకాశం ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే ఎవరితో ఎలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేయించుకుంటే బెస్ట్ అవుట్ పుట్ వస్తుంది వంటి అంశాలపై ముగ్గురు చర్చించుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముగ్గురు కొరియోగ్రఫర్లు వెరీ ట్యాలెంటెడ్ అనడంలో సందేహమేం లేదు. ఎవరికి వారు యూనిక్ స్టైల్ తో పని చేస్తారు. ఇప్పటివరకూ వాళ్లు పనిచేసిన చిత్రాలకు బెస్ట్ కొరియోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే.
అయితే చరణ్ సినిమాలకు ఎక్కుగా జానీ మాస్టర్- శేఖర్ కంపోజ్ చేస్తుంటారు. అలాగే ఎన్టీఆర్ సినిలకు ప్రేమ్ రక్షిత్- శేఖర్ మాస్టర్లు కొరియోగ్రఫీ చేస్తారు. మరి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా `ఆర్.ఆర్.ఆర్` కోసం ముగ్గురు గట్టిగా పోటీ పడుతున్నారు. మరి సోలో ఛాన్సేనా.. లేక ముగ్గురికి డివైడ్ చేసి అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో దసరా కనుకగా రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉంది టీమ్.