యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సక్సెస్ ఫుల్ గా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో RRR సినిమా ఫస్ట్ వీక్ లో 180+ కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతదేశపు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి 2' సినిమా మొదటి వారంలో 117.77 కోట్లు షేర్ అందుకొని.. లాంగ్ రన్ లో 153 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే 'బాహుబలి 2' రికార్డును అధిగమించింది. రేపు ఉగాది పండుగ ఉండటంతో ఈ వీకెండ్ లో మరిన్ని వసూళ్ళు ఎక్సపెక్ట్ చేయొచ్చు. అయితే మిగతా అన్ని ఏరియాలలో బ్రేక్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
నార్త్ మార్కెట్ లో RRR సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరగా.. మొదటి వారం పూర్తయ్యే నాటికి 131 కోట్లు కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీలో ఎక్కువ రేటుకే సినిమాని అమ్మారు. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి ఇంకా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
యూఏస్ఏలో ప్రీమియర్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఆర్.ఆర్.ఆర్.. ఇప్పటి వరకు 11 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 15 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ట్రెండ్ చూస్తే RRR మూవీ తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా సెంటర్లలో 'బాహుబలి 2' వసూళ్లను అధిగమించడం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
కాగా, RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.
ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.