నిన్ను ఒదల బొమ్మాళీ అంటోంది కరోనా వైరస్. ఇందులో కొత్త వెర్షన్లు పురుడుపోసుకుని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా వినోద ప్రపంచానికి ఈ వైరస్ లు ఊపిరాడనివ్వడం లేదు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించే అన్ని వర్గాలను చావు దెబ్బ కొడుతున్నాయి. ఇప్పటికే రెండు వేవ్ లుగా కరోనా జనాల్ని సంహరించింది. ఇప్పుడు ఒమిక్రాన్ ముప్పు భయపెడుతోంది. చావులు తక్కువగా కనిపిస్తున్నా కానీ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందన్న భయాందోళనలు సినీప్రపంచాల్ని ఒణికిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ లకు రెడీ అయిన చాలా సినిమాల సన్నివేశమేమిటో అర్థం కాని గందరగోళంలో పడింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో విడుదలవుతున్న ఆర్.ఆర్.ఆర్ సహా ఇతర సినిమాలపైనా ఒమిక్రాన్ ప్రభావంపై ఇప్పుడు ఆందోళన నెలకొంది.
ఒమిక్రాన్ విజృంభణ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంటోంది. అమెరికా సహా ఇండియాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీంతో పాన్ ఇండియా సినిమాల విడుదలకు పరిస్థితి చాలా దారుణంగా మారింది. కానీ విడుదల అనివార్యం. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ చిత్రం చాలా సార్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కి వస్తున్న వేళ మేకర్స్ ఇక ఆపే పరిస్థితి కనిపించడం లేదు. మరింత జాప్యానికి ఆస్కారం లేదు. నిజానికి ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. అక్టోబర్ లోనే సినిమా విడుదలకు సిద్ధమైంది. అప్పట్లో రిలీజ్ చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అయితే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఒక విధంగా సినిమాకు ఇది మేలు చేసింది. ప్రమోషన్స్ కి కావాల్సినంత సమయం చిక్కింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో జక్కన్న టీమ్ సక్సెసైంది. ఆర్.ఆర్.ఆర్ పై అమాంతం హైప్ పెరిగింది.
కానీ ఇంతలోనే పెద్ద చిక్కు. పరిస్థితులు అమాంతం మారిపోయాయి. ప్రస్తుత సమస్య కొత్త మహమ్మారి ఒమిక్రాన్ వేవ్ వేడెక్కిస్తోంది. దీనివల్ల ముంబై సహా మెట్రోల్లో నైట్ కర్ఫ్యూలు భయపెడుతున్నాయి. తిరిగి యాభై శాతం ఆక్యుపెన్సీ.. కోవిడ్ నియమాలు.. అంటూ టెన్షన్లు ఉన్నాయి. ఇక ఏపీలో టికెట్ రేట్ల సమస్య పెద్దగా ఉండగా థియేటర్లు మూసేస్తున్నారు. అలాగే చాలా చోట్ల ప్రదర్శనలు లేవు. ఇప్పటికే ఢిల్లీలో ఎల్లో అలర్ట్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దిల్లీ ముంబై బెంగళూరు చెన్నై వంటి చోట్ల నుంచి భారీ వసూళ్లను తెచ్చేందుకు ఆస్కారం ఉంది. కానీ ఇలాంటి జనసమూహాలు ఉన్న చోట ఒమిక్రాన్ విజృంభణపై ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర.. ఢిల్లీ వంటి ప్రాంతాలు సినిమా వ్యాపారానికి బలమైన మార్కెట్ ఉన్నా ఇప్పుడు ఇబ్బందికర సన్నివేశం కనిపిస్తోంది.
మరోవైపు యుఎస్ లో పరిస్థితి మరీ కల్లోలంగా మారిందన్న రిపోర్ట్ ఊపిరాడనివ్వడం లేదు. అమెరికాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మునుపటి వేవ్ లతో పోలిస్తే అందుకు భిన్నంగా పిల్లలు గణనీయమైన సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చన్న ఆందోళన నెలకొంది.
ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి మహమ్మారి ఆంక్షలు లేవు. ఇక్కడ ఒమిక్రాన్ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం కొంతవరకూ ధీమానిస్తోంది. అయితే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఉత్తరాదిలో పరిస్థితి రెండు వారాల్లో మారిపోయింది. ఇప్పటికే అమెరికాలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. షోలు రద్దు చేస్తే బయ్యర్లు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గందరగోళం మధ్య సినిమాను విడుదల చేయడం నిజంగా కష్టమైన విషయమేనని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రాలో టికెట్ చిక్కులు!
చాలా కాలంగా పరిష్కారం లేని సమస్యగా ఏపీలో టికెట్ రేట్ల అంశం నలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై దిగి రావడం లేదు. దీనికి తోడు థియేటర్ల సీజ్ అంశం వేడెక్కిస్తోంది. అధికారులు థియేటర్లలో తనిఖీలు నిర్వహించి ఫైన్ లు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు రిలీజవుతున్న అన్ని సినిమాలకు ఇబ్బందికరం. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాకు ఎదురవుతున్న అతి పెద్ద సమస్యగా దీనిని చూడాలి. జనవరి 5వ తేదీలోగా టిక్కెట్ ధరలు సవరిస్తారని అంచనాలు ఉన్నా మేకర్స్ ఎగ్జిబిటర్లకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో చూడాలి. ఆంధ్ర -సీడెడ్ ప్రాంతాలలో ఈ చిత్రం 140 కోట్లకు విక్రయించగా.. భారీ వసూళ్లను సాధిస్తేనే రికవరీ సాధ్యమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత టికెట్ రేట్ల ప్రకారం ఇది సాధ్యం కాదన్న అంచనా కూడా ఉంది.
వారంలోనే ఒమిక్రాన్ కేసులతో దడ!
సోమవారం నాటికే యునైటెడ్ స్టేట్స్ అర మిలియన్ (5లక్షలు) కంటే ఎక్కువ కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించడంతో ఒకటే టెన్షన్ అలుముకుంది. ఏ ఇతర సీజన్ తో పోల్చినా కానీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రెండో వేవ్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేవ్ కొనసాగుతోంది. అమెరికాలో ఒక రోజులో దాదాపు 3లక్షల 30వేల కేసులు నమోదు కాగా ఒమిక్రాన్ కేసులు 5లక్షలుగా నమోదైంది. దీంతో థియేటర్లు బంద్ కు తిరిగి పరిస్థితులు దారి తీస్తాయా అని ఇండస్ట్రీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం యుఎస్ లో క్రిస్మస్ ని పురస్కరించుకుని సెలవుల్ని ఆస్వాధించే మూడ్ లో ఉన్నారు జనం. ప్రతిచోటా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే పరిస్థితి ఉంది. ఓమిక్రాన్ నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వం పరీక్షను ముమ్మరం చేసింది. ఉచిత పరీక్షలు ప్రతిచోటా సులభంగా అందుబాటులోకి తేవడం కొంత ఊరట.
ఇక ఇండియాలో పరిస్థితిని సమీక్షిస్తే.. ఇప్పటివరకూ జనం రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి భయాందోళనలు లేవు. బూస్టర్ డోస్ లు పొందడంలోనూ ముందంజలో ఉన్నారు ఇక్కడ. కేసుల విషయంలో ఎలాంటి భయాందోళనలు లేవు. ప్రస్తుతానికి ఇండియాలో అదుపులో ఉన్నా భయాందోళనలు అలానే ఉన్నాయి. ఇక అమెరికా లాంటి చోట్ల థియేటర్లను బంద్ చేస్తారా లేదా? అన్నదానికి ఇంకా జవాబు లేదు. అక్కడ పోరాడేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతం కొంతవరకూ ఊరట అని పలువురు విశ్లేషిస్తున్నారు. జనం థియేటర్లకు రావాలి. సినిమాలు చూడాలన్నదే అంతిమంగా వినోద పరిశ్రమలు కోరుకునేంది. ఒమిక్రాన్ టెన్షన్స్ నుంచి ప్రజలు మరో మూడు వారాలు దూరంగా ఉంటే ఆర్.ఆర్.ఆర్ కి అది కలిసొచ్చే అంశం అవుతుంది. కానీ ఏం జరుగుతుందో చూడాలి.