టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా అంటే ఇండియాలో ఉన్న సినీ ప్రేమికులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రియులకు ఇంకా చెప్పాలంటే విదేశీ భాషల సినీ ప్రేక్షకులకు కూడా ఓ రేంజ్ లో మోజు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి క్రేజ్ ఉన్న రాజమౌళి నుండి ఈ నెలలోనే రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి మొదలు అయ్యింది.
సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా మూడు వారాల సమయం ఉంది. ఈ మూడు వారాల్లో మరింతగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఇంతలోనే యూఎస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ను ఓపెన్ చేయడం జరిగింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించిన విషయాన్ని ముందుగానే ప్రకటించి ఆ సమయం కు అడ్వాన్స్ బుకింగ్‌ను మొదలు పెట్టడంతో అనూహ్యంగా యూఎస్ ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ ఉన్న సైట్ పై పడ్డారట.
ఒక్కసారిగా అత్యధికులు లాగిన్ అవ్వడంతో ఏకంగా అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించిన సైట్ క్రాష్ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఏకంగా మూడు లక్షల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే మిలియన్ మార్క్ కూడా చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని రికార్డులు ఈ సినిమాకు దక్కబోతున్నాయి అనేందుకు ఇదే నిదర్శణం. ముందు ముందు రాబోతున్న రికార్డులకు ఇది కేవలం శాంపిల్ మాత్రమే.
కేవలం ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ లతోనే రెండున్నర మిలియన్ ల డాలర్లు వసూళ్లు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అత్యంత భారీగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్స్ సినిమా లో ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు.. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల ఇతర భాషల సినీ అభిమానులు ఈ సినిమా కు నీరాజనాలు పలికేందుకు సిద్దంగా ఉన్నారు.
రామ్ చరణ్ ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా చూపిస్తున్నారు. ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఈ సినిమాలో నటించడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బాహుబలి రికార్డులను ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలు కూడా బ్రేక్ చేయలేక పోయాయి. కనుక ఆ రికార్డులను మళ్లీ రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ సినిమా తోనే బ్రేక్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.