చీర‌లో స‌న్న‌జాజి గుబులు రేపే అందం

మోడ్ర‌న్ డే లుక్ లేదా చీర‌క‌ట్టులో స‌న్న‌జాజి సోయ‌గం వాణీ క‌పూర్ గుబులు రేపే అందాల‌తో విరుచుకుప‌డుతుంది.

Update: 2024-10-01 17:30 GMT

మోడ్ర‌న్ డే లుక్ లేదా చీర‌క‌ట్టులో స‌న్న‌జాజి సోయ‌గం వాణీ క‌పూర్ గుబులు రేపే అందాల‌తో విరుచుకుప‌డుతుంది. య‌ష్ రాజ్ బ్యాన‌ర్ నిర్మించిన‌ వార్ చిత్రంలో హృతిక్ స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. కొన్ని విదేశీ కంపెనీలు, ప‌లు కార్పొరెట్ బ్రాండ్ల‌తో కోట్లాది రూపాయ‌ల విలువ చేసే బిగ్ డీల్స్ ని కుదుర్చుకుంది. దాదాపు ప‌దేళ్ల కెరీర్ ర‌న్ సాగించిన త‌ర్వాత వాణీకి ఈ స్థాయి ద‌క్కింది.

ఇటీవ‌ల వాణీ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తోంది. మ‌రోవైపు త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తోను యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వాణీ ట్రెండీ శారీ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతోంది. జెరీ అంచు ఎల్లో శారీలో వాణి ఎంతో సొగ‌సుగా క‌నిపించింది.

సుమారు ఐదున్న‌ర అడుగుల ఎత్తు ఉండే వాణీ చీర‌లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. బెబో క‌రీనా కంటే రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ జీరో సైజ్ బ్యూటీగా వెలిగిపోతోంది. వాణీ అలా కొంగును స‌రి చేసుకుంటూ అంద‌మైన స్మైలిస్తూ క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌స్తుతం మార్వ‌ల్ సినిమాటిక్స్ యూనివ‌ర్శ్ లో న‌టించిన ఫ‌వాద్ ఖాన్ తో క‌లిసి ఓ చిత్రంలో న‌టించేందుకు వాణీ సిద్ధంగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే పాపుల‌ర్ పిజ్జా బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తూ అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Tags:    

Similar News