`కన్నప్ప` ఇకపై కొత్తగా ప్లాన్ చేయాలా?
కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని మంచు విష్ణు అండ్ కో `కన్నప్ప` చిత్రానికి సంకల్పించిన సంగతి తెలిసిందే.
కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని మంచు విష్ణు అండ్ కో `కన్నప్ప` చిత్రానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. జరిగిన ఆలస్యం ఎలాగూ జరిగిపోయింది. ఒక్క హిట్ తో అన్ని లెక్కలు సరిచేయాలని మంచు అండ్ కో నడుం బిగించి కన్నప్పతో రంగంలోకి దిగింది. భారీ కాన్సాస్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇలా టాప్ స్టార్లనే రంగంలోకి దించారు.
80 శాతం షూటింగ్ అంతా స్టిట్జర్లాండ్ లోనే చేస్తున్నారు. ఈ కథకి అక్కడ లొకేషన్ డిమాండ్ చేయడంతో మంచు అండ్ కో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అక్కడే నెలల తరబడి పనిచేసారు. ఇక సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అంచనాలు మొదలయ్యాయి. పోస్టర్ విష్ణు లుక్ అదిరిపోయే సరికి పెద్ద ప్రయోగమే చేస్తున్నారనిపించింది. అటుపై ఒక్కో టాప్ స్టార్ పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడే కాస్త పంచ్ పడింది.
విష్ణు లుక్ మినహాయిస్తే మిగతా పోస్టర్లకు ఏమంత బజ్ క్రియేట్ అవ్వలేదు. టాప్ స్టార్లను ఓ రేంజ్ లో లాంచ్ చేయడంలో తడబడ్డారా? అనే విమర్శ వ్యక్తమైంది. తాజాగా `పిలక – గిలక’ అంటూ సప్తగిరి, బ్రహ్మానందం పాత్రల్ని పరిచయం చేశారు. ఈ రెండు పాత్రలు మరింత నెగిటివిటీకి దారి తీస్తున్నాయి. ఆ పాత్రలకు పెట్టిన పేర్లు చూస్తే బీసీ కాలం నాటి కామెడీ ట్రై చేస్తున్నారానా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ కి గొప్ప రెస్పాన్స్ రాలేదు.
దీంతో ఇంత వరకూ వచ్చిన పాజిటివ్ బజ్ అంతా నెగిటివ్ గా మారుతుందని నెట్టింట కథనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో యూనిట్ ఈ నెగిటివిటీని వీలైనం త్వరగా చెరుపుకోవాలి అంటూ సలహాలు వెళ్తున్నాయి. ఈ సినిమా కోసం విష్ణు అండ్ మంచు ఫ్యామిలీ ఎంతో కష్టపడుతుంది. కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం చేస్తున్నారు. అలాగే సినిమా డిసెంబర్ లో రిలీజ్ అనే ప్రచారం ఉంది. అదే నెలలో పుష్ప-2, గేమ్ ఛేంజర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ వేవ్ లో కన్నప్ప రిలీజ్ అవుతుంది అంటే? హంగామా ఇంకే రేంజ్ లో ఉండాలి.