'RRR' ఇంపాక్ట్: శ్రీకాకుళంలో ఐర‌న్ ఫెన్సింగ్!

Update: 2022-03-23 05:34 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్  అయింది. మ‌రికొన్ని గంట‌ల్లోనే చిత్రం ప్రేక్ష‌కుల ముదుకు రాబోతుంది. రామ్-భీమ్ అభిమానుల్లో ఒక‌టే  న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగుతోంది. రిలీజ్ గ‌డియ‌లు కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ` ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ థియేట‌ర్లు అన్ని ముస్తాబైపోయాయి. చ‌ర‌ణ్‌-తార‌క్ అభిమానులు పూల‌మాల‌తో థియేట‌ర్ల‌ని అందంగా తీర్చి దిద్దారు. బెనిఫిట్  షోలు ప‌డే థియేట‌ర్ల వద్ద హంగామా అయితే పీక్స్ లో ఉంది.

ఫ‌స్ట్ షో ప‌డిన వెంట‌నే థియేట‌ర్లోనే ట‌పాస్ లు పేల్తాయి..ఇక చ‌ర‌ణ్-తార‌క్ పాత్ర‌ల ఎంట్రీ షురూ అయితే ఫ్యాన్స్ ర‌చ్చ ఏస్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట‌ర్లు ఒక్క‌సారిగా ద‌ద్ద‌రిల్లిపోతాయి. చ‌ర‌ణ్‌-తార‌క్ అభిమానులు సంయుక్తంగా చేయాల్సిన హ‌డావుడి కాబ‌ట్టి ఇంకాస్త ఎక్కువ‌గానే  థియేట‌ర్ల వ‌ద్ద హంగామా చోటు చేసుకుంటుంది.

తెర‌పై చ‌ర‌ణ్‌..తార‌క్ పాత్ర‌లు క‌నిపించ‌గానే గాల్లోకి పూలు..కాగితాలు..మెరుపులు ఓ రేంజ్ లో ఎగురుతాయి. స‌రిగ్గా తెర ముందుకెళ్లి అభిమానులు నానా హంగామా చేస్తారు. ఈ ర‌క‌మైన హ‌డావుడి థియేట‌ర్లో సినిమా వీక్షించే మిగ‌తా వారికి అసౌక‌ర్యంగా ఉంటుంది. కానీ భ‌రించ‌క త‌ప్ప‌దు. వీలైంన‌త వ‌ర‌కూ క్రౌడ్ ని అదుపుచేయ‌డానికి థియేట‌ర్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తుంది.

దీనిలో భాగంగా శ్రీకాకుళంలోని సూర్య థియేటర్ స్ర్కీన్ ముందే ఏకంగా ఐర‌న్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు. స్ర్కీన్ కి ఎలాంటి డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా ఈ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆ థియేట‌ర్ లో ఎదురైన అనుభ‌వాల నేప‌థ్యంలో థియేట‌ర్ ఇంచార్జ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫ్యాన్స్ అంతా సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఉంటారు.

ముందు..వెనుకా ఏం జ‌రుగుతుందో ప‌ట్టించుకునే పరిస్థితి ఉండ‌దు. అందుకే స్ర్కీన్ కి ఎలాంటి డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా ముందొస్తు చ‌ర్య‌ల్లో  భాగంగా పెన్సింగ్ ఏర్పాటు చేసామన్నారు. ఇకా తెలుగు రాష్ర్టాల్లో చాలా థియేట‌ర్లో ఇలాంటి ఏర్పాట్లు చేసే ఉంటారు. తెలంగాణ‌లో ఈ ర‌క‌మైన హ‌డావుడి పెద్ద‌గా క‌నిపించ‌దుగానీ..ఏపీలో అన్ని ఏరియా థియేట‌ర్లోనూ స్టార్ హీరో సినిమా అంటే ర‌చ్చ రంబోలా అయిపోతుంది. అందులోనూ రామ్ చ‌ర‌ణ్‌- తార‌క్ ఒకే ప్రేమ్ లో క‌నిపించే  చిత్రం కాబ‌ట్టి  ఫ్యాన్స్ అదుపు చేయ‌డం దాదాపు అసాధ్యం.

ఇప్ప‌టికేహైద‌రాబాద్ సిటీ  ఫ‌రిదిలో ఏడు థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసారు. మూసాపేట్..ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని కొన్ని థియేట‌ర్ల‌లో  బినిఫిట్  షోలు ప‌డుతున్నాయి. దీనిలో భాగంగా థియేట‌ర్ల‌ని ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. థియేట‌ర్ ముందు భారీ క‌టౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్- రాజ‌మౌళి త్ర‌యం క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంటున్నారు.

ఇప్ప‌టికే రాజ‌మౌళి భ్ర‌మ‌రాంభ థియేట‌ర్లో అభిమానుల మ‌ధ్య‌లో కూర్చొని షో చూస్తాన‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్..తార‌క్  సైతం ఇలాంటి వీక్ష‌ణ‌కి ఆస‌క్తిగానే ఉన్నారు. కానీ అభిమానుల మ‌ధ్య  సెక్యురిటీ ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆ కార‌ణంగా వెన‌క్కి త‌గ్గుతున్నారు. మ‌రి చివ‌రి నిమిషంలో రాజ‌మౌళి దైనా ఐడియా ఇస్తే ముందుకొచ్చే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News