నెట్ ఫ్లిక్స్ లో RRR మరో అరుదైన రికార్డ్

Update: 2022-07-28 04:16 GMT
పాన్ ఇండియా మూవీ RRR సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా లాంచింగ్ డే నుంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది.  నేటి తరంలో ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లను క‌లిపి రాజ‌మౌళి చేసిన అసాధార‌ణ ప్ర‌యోగంగా ఆర్.ఆర్.ఆర్ గురించి ముచ్చ‌ట సాగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లను రాబట్టి రాజమౌళి సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

ఇప్ప‌టికీ ఆర్.ఆర్.ఆర్ పై ప్ర‌పంచ సినీప్రేమికులు ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. ఓటీటీ విడుదల తర్వాత కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వరుసగా 10 వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన ఏకైక ఆంగ్లేతర చిత్రంగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. పాశ్చాత్య ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటం ప్రారంభించడంతో OTT విడుదల సినిమాకు మరింతగా సహాయపడింది. సినిమాలోని వీడియో క్లిప్ లను షేర్ చేస్తూ ఆంగ్లేయులు సైతం ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ పై త‌మ‌ ప్రేమను కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ టాప్‌ టెక్నీషియన్స్‌.. డైరెక్టర్స్ న‌టీన‌టులు ఆర్.ఆర్.ఆర్ ని వీక్షించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఇరువురి స్టార్ డమ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది. చ‌ర‌ణ్ కు ఇప్ప‌టికే హాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మరి ఈ సంచలన చిత్రం రానున్న రోజుల్లో ఇంకా ఏ తీరుగా కీర్తిని అందుకుంటుందో వేచి చూడాలి.

తొలి 10 రోజుల్లో 1000 మిలియన్ మార్క్ 2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR థియేట్రిక‌ల్ గా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 2022లో 1000 కోట్ల క్ల‌బ్ సినిమాగా రికార్డులు తిర‌గ‌రాసింది. అంత‌కుమించి ఓటీటీలో విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.  తొలుత జీ5లో త‌ర్వాత నెట్ ఫ్లిక్స్ లోనూ అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. SS రాజమౌళి తెర‌కెక్కించిన‌ బ్లాక్ బస్టర్ RRR ప్రస్తుతం OTT ప్లాట్ ఫారమ్ ZEE5లో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

20 మే 2022న డిజిటల్ గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంది. ఈ చిత్రం అన్ని భాషలు క‌లుపుకుని కేవ‌లం 10 రోజుల్లో 1000 మిలియన్ (1 బిలియన్) కంటే ఎక్కువ నిమిషాల వీక్ష‌ణ‌ల‌ను అందుకుంది. ZEE5లో ఇటీవల విడుదలైన ఏ చిత్రం తో పోల్చినా ఇది అసాధార‌ణ‌మైన ఆద‌ర‌ణ. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్- అజయ్ దేవగన్- సముద్రఖని- ఒలివియా మోరిస్- శ్రియా శరణ్ త‌దిత‌రులు న‌టించారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ‌ భారీ స్థాయిలో నిర్మించింది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

RRR ఒక గొప్ప జ‌న‌రంజ‌క‌మైన వినోదాత్మ‌క సినిమా అని అన్ని వేదిక‌ల‌పైనా ప్రూవ్ అయింది. పెద్ద‌తెర‌ను డామినేట్ చేసేంత‌గా ఓటీటీ ఎదిగేస్తున్న క్ర‌మంలో ఇక్క‌డా సంచ‌ల‌నంగా మారింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌కు ఫిక్ష‌న్ క‌థ‌ల‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంటుంద‌న‌డానికి ఆర్.ఆర్.ఆర్ ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఈ లెస్స‌న్ బాలీవుడ్ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌న జ‌క్క‌న్న నేర్పించార‌న్న చ‌ర్చ సాగుతోంది. మునుముందు రాజ‌మౌళి నుంచి ఇలాంటి పాన్ ఇండియా (వ‌ర‌ల్డ్) సినిమాలు వ‌స్తాయ‌నడంలో సందేహం లేదు. త‌దుప‌రి మ‌హేష్ ని అత‌డు పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.
Tags:    

Similar News