అక్క‌డ‌ ర‌జ‌నీ రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్న 'RRR'!

Update: 2022-12-04 08:33 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్  RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లు తొలి సారి క‌లిసి న‌టించిన‌ ఈ విజువ‌ల్ ఎక్స్‌ట్రావ‌గాంజా వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఐదు భాష‌ల్లో రికార్డు స్థాయిలో రూ.1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన త‌రువాత ఈ మూవీ క్రేజ్ మ‌రింత‌గా పెరిగిపోయింది.

హాలీవుడ్ స్టార్స్ తో పాటు హీలీవుడ్ మేక‌ర్స్, విదేవీ సినీ ప్రియులు సైతం ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ సినిమాని నెట్టింట వైర‌ల్ చేయ‌డం తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లై హ్యూజ్ అప్లాజ్ ని దేశీయ ప్రేక్ష‌కుల నుంచే కాకుండా విదేశీ సినీ ప్రియుల్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న  RRR ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు తిర‌గ‌రాస్తూ తూసుకుపోతోంది. అయినా కూడా ఈ మూవీ జ‌పాన్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ ఇప్ప‌టికీ నెట్టింట ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతున్న RRR ని రీసెంట్ గా జ‌పాన్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. గ‌తంలో ఏ తెలుగు సినిమా రిలీజ్ కాని స్థాయిలో రికార్డు స్థాయి థియేట‌ర్ల‌లో విడుద‌లైన  RRR అక్క‌డ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. జ‌ప‌నీస్ ని త‌న‌దైన స్టైల్లో మెస్మ‌రైజ్ చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. అక్టోబ‌ర్ 21న  RRR ని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని భారీ స్థాయిలో నిర్వ‌మించిన టీమ్ అందుకు త‌గ్గ‌ట్టుగానే ఫలితాన్ని పొంతుదోంది. జపాన్ లో ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు 362M (2.7M) 22 కోట్లు రాబ‌ట్టింది. 27 సంవ‌త్స‌రాల క్రితం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `ముత్తు` మూవీ 400M క‌లెక్ట్ చేసి భార‌తీయ సినిమాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్ లో ర‌జ‌నీ న‌టించిన ముద్దు 1995 నుంచి అక్టోబ‌ర్ లో విడుద‌లైన ఈ మూవీ జ‌పాన్ లో అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి చ‌రిత్ర సృష్టించింది.

ఇప్ప‌డు ఇన్నేళ్ల త‌రువాత ర‌జ‌నీ రికార్డుని  RRR తిర‌గ‌రాయ‌బోతోంది. అ ఫీట్ కు ఒక్క అడుగు దూరంలో వుండ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో  RRR 500M మార్కుని దాటి ఇండియ‌న్ సినిమాల‌కు స‌రికొత్త బెంచ్ మార్క్ ని జ‌పాన్ మార్కెట్ లో సెట్ చేయ‌బోతోంది. RRR జ‌పాన్ క‌లెక్ష‌న్ ల వివ‌రాలు ఇలా వున్నాయి.

ఫ‌స్ట్ వీక్‌...          81.M (8 రోజుల‌కు)

సెకండ్ వీక్      72.M

థ‌ర్డ్ వీక్‌             65.4M

ఫోర్త్‌ వీక్‌             45M

ఫిఫ్త్‌ వీక్‌              50M

సిక్స్త్‌ వీక్‌           48M

RRR టోట‌ల్ జ‌పాన్ క‌లెక్ష‌న్స్ 362M
Tags:    

Similar News