శార్వరీ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా 'RRR' కు సంబంధించి ఒక కానుక ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామని ఎస్ఎస్ రాజమౌళి టీమ్ నిన్నే ప్రకటించారు. దీంతో ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ థ్రిల్ అయ్యేలా కాసేపటి క్రితమే 'RRR' మోషన్ పోస్టర్ ఫైనల్ గా మన ముందుకు వచ్చింది.
సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ RRR గానే కొనసాగిస్తూ 'రౌద్రం రణం రుధిరం' అంటూ ఆ అక్షరాలకు ఫుల్ ఫామ్ వెల్లడించారు. ఒక నిముషం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ మోషన్ పోస్టర్ లో అగ్ని స్వరూపంగా రామ్ చరణ్.. జల స్వరూపంగా ఎన్టీఆర్ ను చూపించడం విశేషం. నిప్పు రవ్వలు ఎగసి పడుతుంటే.. దుస్తులపై అగ్ని రగులుతూ ఉంటే చరణ్ పరిగెడుతూ ఉంటారు. మరోవైపు.. మబ్బులు ముసురుకుని ఉన్నట్టుగా ఉన్న వాతావరణంలో నీటి బిందువులు అలా జల్లులా ఎగసి పడుతూ ఉంటే ఎన్టీఆర్ కూడా అదే స్టైల్ లో పరిగెడుతూ ఉంటారు. నెక్స్ట్ షాట్ లో ముందు వైపు నుంచి సిలౌట్ తరహాలో పరిగెడుతూ కనిపిస్తారు. ఆ సమయంలో రౌద్రం కు సింబల్ గా చరణ్ ను... రుధిరం కు సింబల్ గా ఎన్టీఆర్ ను పవర్ఫుల్ గా చూపిస్తూ మధ్యలో ఉన్న R అక్షరం రణం అంటూ పూర్తి టైటిల్ వెల్లడించాడు. ఈ అక్షరం చూపించే సమయంలో నీరు.. నిప్పు కలిసినట్టుగా ఇద్దరి షేక్ హ్యాండ్ ఉంది.
మధ్య R లో 1920 అంటూ కథ జరిగే కాలం కూడా వెల్లడించారు. ఫైనల్ గా 'రౌద్రం రణం రుధిరం' అంటూ ఫుల్ టైటిల్ చూపించే సమయంలో RRR అక్షరాలలో ఇంటెన్స్ లుక్ లో ఉన్న చరణ్.. ఎన్టీఆర్ ను చూస్తూ.. 'తరరంతరరం' అంటూ నేపథ్యంలోవినిపిస్తున్న హమ్మింగ్ వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనా దెబ్బకు టెన్షన్ లో ఉన్న జనాలకు ఈ మోషన్ పోస్టర్ తో పెద్ద రిలీఫ్ వచ్చింది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.
Full View