RRR హిందీ బెల్ట్ నుంచి ఎంత తెస్తుంది?

Update: 2022-03-27 12:33 GMT
భార‌త‌దేశంలో 120 కోట్లు పైబ‌డిన‌ జ‌నం ఉన్నారు. ఇంత‌మందిలో థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసేది ఎంద‌రు? అయితే బాహుబ‌లి ఫ్రాంఛైజీ మాత్రం అత్యంత భారీగా జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించింది. బాహుబ‌లి 1 - బాహుబ‌లి 2 చిత్రాలు రెండూ క‌లిపి దాదాపు 2500 కోట్ల మొత్తాన్ని వ‌సూలు చేసాయి. ఇది ప్ర‌భాస్ -రానా- రాజ‌మౌళి కాంబినేష‌న్ సంచ‌ల‌నం. అటు బాలీవుడ్ లో దంగ‌ల్ సాధించిన విజ‌యాన్ని మించి ఇండియాలో బాహుబ‌లి 2 సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. జ‌నాల్ని ఎక్కువ‌గా థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన చిత్రాలుగా ఇవి నిలిచాయి.

ఆ త‌రవాత ఆర్.ఆర్.ఆర్ కి అంత స్టామినా ఉంద‌ని ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌లి కరోనా క్రైసిస్ నేప‌థ్యంలో భ‌యాల వ‌ల్ల జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేక‌పోవ‌డం కూడా ఆర్.ఆర్.ఆర్ కి క‌లిసొస్తోంది. ఇప్పుడు క‌రోనా నెమ్మ‌దించిన నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ‌వ్వ‌డం పెద్ద ప్ల‌స్ గా మారింది.

అయితే ప్రాంతీయ భాష‌ల్లో ఈ సినిమా ఎంత‌గా రాణించినా కానీ ఉత్త‌రాది మార్కెట్లో ఆడ‌టం చాలా ఇంపార్టెంట్. అక్క‌డ జ‌నాల్ని ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగితే  మాస్ ని ఆక‌ర్షించ‌గ‌లిగితే వ‌చ్చే క‌లెక్ష‌న్లు వేరు. కేవ‌లం ఉత్త‌రాది మార్కెట్ నుంచే దాదాపు 300 కోట్లు పైగా వ‌సూలు చేసేందుకు వీలుంటుంద‌ని ఇప్ప‌టి అంచ‌నా. అయితే ఆర్.ఆర్.ఆర్ ఈ ఫీట్ ని సాధిస్తుందా? అంటే.. సాధించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న అంచ‌నా ఉంది. ఎవ‌రికి వారు ఈ విజ‌యంపై విశ్లేషిస్తూనే ఉన్నారు.

ఒక‌టో రోజు కంటే రెండో రోజు ఆ త‌ర్వాత సండే ఉత్త‌రాది మార్కెట్లో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు అంత‌కంత‌కు పెరుగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. దీన‌ర్థం ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌నాల‌కు ఇంకెంతో దూరంలో లేదు అనే. ఇక మ‌ల‌యాళం..క‌న్న‌డంలోనూ తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల త‌ర‌హాలో సాధించ‌గ‌లిగితే ఆర్.ఆర్.ఆర్ అఖండ విజ‌యం సాధించింద‌ని భావించ‌వ‌చ్చు. అమెరికాలో ఇప్ప‌టికే 50 కోట్లు మించి వ‌సూలు చేసింది. బ్రిట‌న్ - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లాంటి చోట్లా ఆడుతోంది. ఈ సినిమాని అటు జ‌పాన్ - చైనా మార్కెట్ల‌లోనూ త‌దుపరి రిలీజ్ చేయ‌నున్నార‌న్న‌ది జ‌గ‌ద్విదితం.
Tags:    

Similar News