టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా విజువల్ వండర్ గా ఇండియన్ ప్రేక్షకులు అద్భుతం అంటూ కితాబిచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్‌ఆర్ సినిమా యొక్క విజువల్ ట్రీక్ కి చాలా మంది ఫిదా అయ్యారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది.
రాజమౌళి సినిమా అంటే వీఎఫ్‌ఎక్స్ అద్భుతం అన్నట్లుగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆస్కార్ నామినేషన్స్ ను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యొక్క వీఎఫ్‌ఎక్స్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ నిరాశ పరిచింది.
తాజాగా అకాడమీ నుండి నామినేషన్స్ కు సంబంధించిన షార్ట్ లిస్ట్ వచ్చిన విషయం తెల్సిందే. అందులో వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా ఉంది. ఆ జాబితాలో మన ఆర్ ఆర్ ఆర్ సినిమా లేకపోవడంతో విచారకరం. అవతార్ వంటి పెద్ద సినిమాలతో మన సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్స్ లో ఉంటుందని అంతా ఆశపడ్డారు.
కానీ విజువల్ ఎఫెక్ట్స్ షార్ట్ లిస్ట్ లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యొక్క వీఎఫ్‌ఎక్స్ గురించిన ముచ్చట లేకపోవడంతో ఆ కేటగిరి నుండి మన సినిమా తప్పుకున్నట్లే అయ్యింది. అయితే బెస్ట్ సాంగ్ షార్ట్ లిస్ట్ లో మన నాటు నాటు సాంగ్ నిలవడం ఒకింత సంతోషాన్ని కలిగించే విషయం.
ఇక షార్ట్ లిస్ట్ లు రావాల్సిన కేటగిరీలు కొన్నే ఉన్నాయి. అందులో ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ సినిమా. ఈ రెండు కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ లో జక్కన్న పేరు మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా నిలిచినా కూడా నామినేషన్స్ దక్కించుకునే అవకాశం దాదాపుగా లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా నాటు నాటు పాట పైనే ఉంది. ఆ ఒక్క కేటగిరీలోనే ఆస్కార్ నామినేషన్స్ కి ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.