యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది.
RRR మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. శుక్రవారం దుబాయ్ లో తమ సినిమాని ప్రమోట్ చేసుకొని వచ్చిన ట్రిపుల్ ఆర్ టీమ్.. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భారీగా, అంగరంగవైభవంగా జరుగుతున్న RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ గెస్టుగా వచ్చారు.
'ఆర్ ఆర్ ఆర్' టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో కనిపించారు. తమిళనాడు - కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ఇలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభిమానులు ఈ ఈవెంట్ కు వచ్చారు. చిక్బల్లాపూర్ ప్రాంతం అనంతపురం జిల్లాకు దగ్గరగా ఉండడంతో ఆంధ్రా నుంచి ఫ్యాన్స్ భారీగా తరలి వెళ్ళినట్లు తెలుస్తుంది.
దీంతో సభా ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. ఎటు చూసినా 'జై ఎన్టీఆర్' 'జై చరణ్' నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. అరుపులు, కేకలతో RRR జెండాలతో పాటుగా రామ్ చరణ్ - తారక్ చిత్రాలు ముద్రించిన జెండాలతో హంగామా చేశారు. ఓ దశలో జనాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఒక్కసారిగా ఫ్యాన్స్ బారికేడ్లు తోసుకుని రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను కరతాళధ్వనులతో స్టేజీ పైకి ఆహ్వానిస్తూ వదిలిన క్రాకర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ‘పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, మన మనసుల్లో ఉన్నారనడానికి 'జేమ్స్' సినిమానే నిదర్శనం. ఆయన ఆశీస్సులు ఇవ్వడానికి మన మధ్యే ఉన్నారు. నిర్మాత దానయ్య గారికి ధన్యవాదాలు. నాతో కలిసి పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు. కన్నడ, తెలుగు అభిమానులతో ఇక్కడ అపూర్వమైన సంగమాన్ని చూస్తున్నాను'' అని అన్నారు.
RRR సినిమా కోసం టికెట్ల ధరలను పెంచుకోడానికి అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రులకు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన సాన్నిహిత్యంతో సీఎం జగన్ ను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేసారని.. తెర వెనుక ఉండి అంతా నడిపించారని చెప్పుకొచ్చారు.