యావత్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. యూఎస్ఏలో ఈ నెల 24న ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
దర్శకుడు రాజమౌళి మరియు హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి RRR చిత్రాన్ని తమ భుజాన వేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటించడమే కాదు.. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.
అయితే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో.. మీడియా ఇంటరాక్షన్ లలో కనిపించకపోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజమౌళి తెరకెక్కించే చిత్రాలన్నిటికీ కథ అందించే విజయేంద్ర ప్రసాద్.. గతంలో 'బాహుబలి' చిత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' కోసం విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ ల పాత్రలతో కల్పిత కథ రెడీ చేశారు.
లాక్ డౌన్ సమయంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వివిధ వేదికలపై RRR చిత్రానికి ప్రచారం నిర్వహించారు. అయితే భారతదేశపు బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాకి కథ అందించిన రచయిత.. ఇప్పుడు కీలక సమయంలో ప్రమోషన్స్ కు దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా సైతం చరణ్ - తారక్ లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను ప్రమోట్ చేశారు. కానీ RRR రచయిత ప్రచారానికి దూరంగా ఉండటానికి కారణం ఏమై ఉంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇతర సినిమాల స్టోరీలు రాయడంలో బిజీగా ఉండడం వల్ల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్టోరీ లైన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. కారణం ఏదైనా దిగ్గజ రచయిత కూడా సినిమాను తనవంతుగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు