రాజమౌళి ఎప్పుడూ లేని హడావుడి చేస్తున్నాడేంటబ్బా..?

Update: 2022-03-24 17:30 GMT
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడాయన. వెండితెరపై విజువల్స్ క్రియేట్ చేస్తూ.. దర్శకధీరుడు అనిపించుకున్నారు. మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తూ అపజయం ఎరుగని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే రాజమౌళి ఎప్పుడూ లేని విధంగా RRR విషయంలో హడావిడి చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. గత మూడేళ్ళుగా ఎన్నో వ్యయప్రయసాలతో తీసిన ఈ సినిమాని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'బాహుబలి' తర్వాత జక్కన్న నుంచి రాబోతున్న ఈ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవకాశం లేదు.

అయినప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ RRR సినిమా కోసం కనీవినీ ఎరుగని రీతిలో ప్రమోషన్స్ చేశారు. ఎంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా అయినా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రచార కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమోషనల్ స్ట్రాటజీలలో రాజమౌళి దిట్ట. సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లక ముందు నుంచే హైప్ క్రియేట్ చేయడం ఆయనకే చెల్లుతుంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా విషయంలోనూ రకరకాల ప్రమోషన్స్ చేశారు. కాకపోతే ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఈసారి ఎందుకనో ఎక్కువగా హడావిడి చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. జక్కన్న సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. గత చిత్రాలకు ప్రచార కార్యక్రమాలు చేసినా.. పెద్దగా ప్రీ రిలీజ్ హంగామా చేసేవారు కాదు.

కానీ RRR సినిమా కోసం మాత్రం అగ్ర దర్శకుడు హంగామా హంగామా చేసేస్తున్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలు - ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో ఇది కనిపించింది. 'బాహుబలి' కంటే RRR పెద్దది అని అంటున్నాడు.. ఈ రెండింటి కంటే నెక్స్ట్ చేయబోయే మహేష్ బాబు ప్రాజెక్ట్ ఇంకా పెద్దదని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు.

సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే 'బాహుబలి' తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడి చిత్రానికి ఈ రేంజ్ లో ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు.

రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్. అందులో హీరోలు ఎవరనేది పక్కన పెట్టి జనాలను థియేటర్లకు రప్పించే సత్తా ఉంది ఆ పేరుకి. దానికి ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్స్ యాడ్ అయ్యారు. అయినా సరే జక్కన్న మాత్రం RRR సినిమా ప్రమోషన్స్ లో అన్నీ తానై చూసుకుంటున్నారు.. ఇంటర్వ్యూలతో హడావుడి చేస్తున్నారు. మరి సినిమా ఎలా వచ్చిందో.. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

ఏదేమైనా RRR రిజల్ట్ ఎలా ఉంటుందనేది పక్కన పెడుతే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడే రెండు ఫ్యామిలీ హీరోలను ఒకే ఫ్రేమ్ లోని తీసుకొచ్చే ఆలోచన చేసినందుకు.. దాన్ని కార్యరూపం దాల్చినందుకు.. ఇద్దరి హీరోలని బ్యాలన్స్ చేస్తూ.. వారి ఫ్యాన్స్ ని SAMTEU పరుస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు రాజమౌళిని అభినందించి తీరాల్సిందే.
Tags:    

Similar News