ఆర్ ఆర్ ఆర్ ఆలస్యం ఎవరికి లాభం ?

Update: 2018-11-14 08:01 GMT
పైన ప్రశ్న చూసి ఇదేంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకే కదా లాభం ఇంకెవరికో ఎందుకు ఉంటుంది అనే సందేహం రావడం సహజం. కానీ బయటికి కనిపించని మరో ఆసక్తికరమైన కోణం ఇందులో ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్ఆర్ఆర్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. స్వాతంత్రం రాకముందు నేపధ్యాన్ని తీసుకుని బాహుబలి తరహాలో కొంత ఫాంటసీని మిక్స్ చేసి భారీ ఎత్తున రాజమౌళి దీన్ని ప్లాన్ చేసాడట. ఎంత లేదన్నా షూటింగ్ పూర్తి చేయడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టడం ఖాయం అంటున్నారు. 2020 దాకా వచ్చే ఛాన్స్ లేనట్టే.

ఒక్కసారి తన సెట్స్ లోకి అడుగు పెట్టాక హీరోలకు వేరే ఆప్షన్ ఇచ్చే అలవాటు లేని జక్కన్నా దీనికి కూడా అదే ఫార్ములా పాటించబోతున్నట్టు తెలిసింది. ఇది మరోరకంగా ప్లస్ అవుతుంది. అంత గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అప్పుడు వచ్చే హైప్ ఊహకు కూడా అందదు. కానీ ఈ గ్యాప్ మిగిలిన హీరోలకు హెల్ప్ అయ్యేలా ఉంది. ప్రభాస్ సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి వచ్చే సంవత్సరం సెకండ్ హాఫ్ తర్వాతే వస్తాయి కాబట్టి అప్పటిదాకా రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఖాళీగా ఉండాల్సిందే. కాని అంతకు ముందే మహేష్ బాబు మహర్షితో సందడి మొదలుపెట్టేస్తాడు. ఈ లోపు సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరో యువదర్శకుడికి కూడా ఓకే చెప్పాడట.

మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే మూవీ వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది దీంతో పాటు మరో సినిమా కూడా వచ్చేలా ప్లానింగ్ లో ఉన్నాడట. అంటే ఆర్ ఆర్ ఆర్ వచ్చేలోపు ప్రభాస్-మహేష్-బన్నీ ముగ్గురూ చెరో రెండు సినిమాలతో రావొచ్చు. మార్కెట్ మీద గ్రిప్ పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం అవుతుంది. మరి ఆర్ ఆర్ ఆర్ ఆలస్యం అయ్యే కొద్దీ వీళ్ళందరికీ ప్లస్ అవుతుంది. ఇప్పుడే ఆర్ ఆర్ ఆర్ గురించి ఇంత చర్చ జరుగుతోంది అంటే ప్రమోషన్ మొదలుపెడితే వచ్చే హైప్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే 

Tags:    

Similar News