టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ ముగింపు దశకు వచ్చిందట. కొన్ని వారాల క్రితం దర్శకుడు జక్కన్న సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి అయ్యిందంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కంటిన్యూస్ గా ఎన్టీఆర్.. ఓలివియా మోరీస్ ఇంకా ఇతర చిత్ర తారాగణంపై చిత్రీకరణ జరుపుతున్నారట. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ సభ్యుల ద్వారా విశ్వసనీయం తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను ఆలియా భట్ పూర్తి చేసిందట. షూటింగ్ కు గుడ్ బై చెప్పి ప్రమోషన్ కార్యక్రమాల కోసం మళ్లీ హైదరాబాద్ రానుందట. ఇక రామ్ చరణ్.. ఎన్టీఆర్ లపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా పూర్తి అవ్వబోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం మేరకు ఈ సినిమాను జనవరి రెండవ వారంకు పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడట.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే జనవరి 10న చిత్రానికి గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. సంక్రాంతికి ముందే సినిమాను పూర్తి చేయాలని ముందస్తు ప్లాన్ తో జక్కన్న షూట్ చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఫిబ్రవరి నుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి జూన్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగులోనే కాకుండా తమిళం.. హిందీ.. మలయాళం.. కన్నడం భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. బాహుబలి రికార్డులను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మెగా నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి వారి అంచనాలు నిలబెట్టేనా చూడాలి.