కరోనా దెబ్బకు ప్రపంచం కకావికలం అయిపోతోంది. ఎక్కడివాళ్లు అక్కడ గప్ చుప్. ప్రయాణాలు మానుకుని .. పనులు మానుకుని బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. ఇండియా లెవల్లో షూటింగులు బంద్.. థియేటర్లు బంద్.. మాల్స్ సహా అన్ని పరిశ్రమల్లోనూ బంద్ అన్న మాట వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ 24 శాఖల కీలక వ్యక్తులు సమావేశమై షూటింగులు ఆపేసిన సంగతి తెలిసిందే. ఈనెల 19 నుంచి 31 వరకూ షూటింగులేవీ చేయరు. థియేటర్లు ఓపెన్ కావు. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. నిర్మాతల మండలి.. ఫిలింఛాంబర్ .. ఆర్టిస్టుల సంఘం.. ఫెడరేషన్ ఇవన్నీ కలిసి షూటింగుల్ని స్వచ్ఛందంగా ఆపేయడం సంచలనమైంది.
అయితే ఎవరేం చెబితే నాకేంటి? అన్న తీరుగానే ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్స్ ని ఆపకుండా షూట్ చేయాలని నిర్ణయించారట. సైలెంటుగా అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్స్ లో షూటింగు జరిగిపోనుందట. జక్కన్న మొండి వైఖరి కార్యశూరత్వం గురించి ప్రతిసారీ చర్చ సాగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు చరణ్ - తారక్ సైతం కాదనుకుండా షూటింగుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది. కరోనాకి భయపడేది లేదు అంటూ ప్రభాస్ లాంటి స్టార్ యూరప్ వెళితే.. అంత దూరం నంచి తిరిగి ఇండియాకి రప్పించేందుకు టాలీవుడ్ పెద్దల నుంచి పిలుపు వెళ్లింది. విదేశీ షూటింగులన్నీ బంద్ చేసి తిరిగి రావాల్సిందిగా ఇప్పటికే డిమాండ్ ఉంది. అలాంటిది లోకల్ గా ఉన్న రాజమౌళిని మాత్రం ఆపలేకపోతున్నారట. సంక్రాంతి రిలీజ్ అయినా.. కానీ ఆయనలో ఇప్పటి నుంచే టెన్షన్ వాతావరణం అలుముకుందా? అన్న సందిగ్ధతకు ఆయన చర్యలు బలం చేకూరుస్తున్నాయి మరి.
అయితే షూటింగ్ ఆపేస్తున్నామని కానీ.. లేదూ కొనసాగిస్తున్నామని కానీ ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించలేదు. ఆయన చెప్పే వరకూ దేనిపైనా క్లారిటీ లేనట్టే. ఇకపోతే ఇతర శాఖలు సహకరించకపోతే జక్కన్న షెడ్యూల్ ని ఎలా కొనసాగిస్తాడు? అన్నదే ఇక్కడ సస్పెన్స్. లోకల్ ఎక్విప్ మెంట్ రాకపోతే పొరుగు నుంచి రప్పిస్తాడా? అంత మొండితనానికి వెళతాడా? అన్నది కూడా ఇంకా సస్పెన్స్. ఏదేమైనా మరోసారి జక్కన్నకార్యశూరత్వం.. దక్షత.. మొండి వైఖరి గురించి చర్చకు తెరలేచింది. ఇక తన సినిమాలకు నెగెటివ్ పబ్లిసిటీ చేసినా... మొండిగానే తానేం చేయాలనుకుంటారో అదే చేసే రాజమౌళి.. ఈసరి కరోనా విషయంలో ప్రభుత్వ ఆజ్ఞల్ని.. సినీపెద్దల ఆజ్ఞల్ని భేఖాతరు చేస్తున్నారు అంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇది నిజం అనడానికి ప్రూఫ్ అయితే ఏదీ లేదు. కార్యశూరుడి వలె ఆలోచించు.. అలోచనాపరుడిగా వ్యవహరించు.. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటి మేధావి అని నిరూపించు!! ఇలాంటి సూక్తుల్ని జక్కన్న ఆచరిస్తున్నాడంటారా? ఈనెల 19 వరకూ షూటింగులకు అడ్డంకులేవీ లేవు. ఆ తర్వాత మాత్రం షూటింగులు చేయడానికి లేదని చెబుతున్నారు. మరి అప్పటి నుంచి ఆపేస్తాడా ఏమో!!