విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఎఫ్ 3''. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఘన విజయం సాధించిన 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల తేదీపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
హాట్ సమ్మర్ సీజన్ లో కూల్ ఫన్ అందించడానికి సోగ్గాళ్ళను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. అల్టిమేట్ ఫన్ ఫ్రాంచైజ్ ''F 3'' మూవీ 2022 ఏప్రిల్ 28న విడుదల అవుతుందని మరోసారి ప్రకటించారు. నిజానికి ఫిబ్రవరి 25న రిలీజ్ ప్లాన్ చేసుకున్న 'ఎఫ్ 3' చిత్రాన్ని 'భీమ్లా నాయక్' కోసం వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అయితే RRR రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో గందరగోళం ఏర్పడింది.
'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి మరో ఆప్షన్ గా ఏప్రిల్ 28వ తేదీని ప్రకటించారు. అయితే ఇప్పుడు RRR చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తుండటంతో వేసవిలో ''ఎఫ్ 3'' విడుదలకు మార్గం సుగమం అయింది. కాకపోతే అదే పాన్ ఇండియా మూవీ వల్ల మరో పెద్ద సినిమాతో పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. ట్రిపుల్ ఆర్ కోసం 'ఆచార్య' చిత్రాన్ని ఏప్రిల్ 1 నుంచి 29వ తేదీకి షిఫ్ట్ చేశారు. అంటే ఈసారి వెంకీమామ - వరుణ్ కలిసి చిరంజీవి - రామ్ చరణ్ లతో బాక్సాఫీస్ ఫైట్ చేయాల్సి ఉంటుంది.
కాగా, 'ఎఫ్ 2' చిత్రంలో భార్యాభర్తల కథకు ఫన్ - ఫస్ర్టేషన్ కలిపి చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈసారి ''ఎఫ్ 3'' లో డబ్బు అనే ఎలిమెంట్ ని జత చేసి మూడింతల ఫన్ అందించబోతున్నారు. కొత్త కథతో అవే పాత్రలు - క్యారెక్టరైజేషన్లతో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.
ఇందులో వెంకటేష్ రేచీకటి బాధితుడిగా.. వరుణ్ తేజ్ నత్తిగా మాట్లాడే యువకుడిగా కనిపించనున్నారు. తమన్నా భాటియా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. సోనాలి చౌహన్ స్పెషల్ రోల్ లో నటించింది. ఇందులో సునీల్ - రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ వంటి భారీ తారాగణం భాగం అయ్యారు.
'ఎఫ్ 3' చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ కృష్ణ స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. తమ్మిరాజు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.