ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'RRR'. వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలన్న టార్గెట్ తో జక్కన్న టీమ్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. విడుదల తేదీపై అనుమానాలు ఉన్నప్పటికీ సినిమా మాత్రం అనుకున్న సమయానికే తీసుకువస్తామని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇదిలా ఉంటే 'RRR' షూటింగ్ గత కొంతకాలంగా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ సుందరి అలియా భట్ నటిస్తోంది. ఈమధ్యే రామ్ చరణ్.. అలియా భట్ లపై ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించారని సమాచారం. రాజమౌళి అనగానే యాక్షన్.. ఎమోషన్ సీన్స్ లో స్పెషలిస్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజమే కానీ రాజమౌళి రొమాన్స్ లో కూడా ఘనుడే. 'బాహుబలి'లో 'పచ్చబొట్టేసినా' పాట ను కాస్త ప్రశాంతమైన మనసుతో చూసి దాన్లో ఉండే విషయం గ్రహిస్తే అప్పుడు కానీ రాజమౌళి గారి రొమాంటిక్ టచ్ మనకు అర్థం కాదు. మరి ఈ సినిమాలో కూడా చరణ్ - అలియా భట్ జంటపై ప్లాన్ చేసిన పాట కూడా అద్భుతంగా ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు.
ఈ సినిమాలో ఒలివియా మోరిస్.. అజయ్ దేవగణ్.. రాహుల్ రామకృష్ణ.. సముద్రకని ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.