ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ RRRలో సీత పాత్రలో నటిస్తోంది ఆలియా భట్. అల్లూరి సతీమణి సీతగా కనిపిస్తుంది. ఈ మూవీతో పాటు నాలుగు పాన్ ఇండియా చిత్రాలకు ఆలియా గత ఏడాది సంతకాలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇందులో భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూబాయి కతియావాడి పైనా అందరి కళ్లు ఉన్నాయి. బహుశా బ్రహ్మాస్త్రను మించి ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే ఈ మూవీపైనా అందరిలో ఆసక్తి నెలకొందని చెప్పాలి.
ఇక గంగూబాయి అనే వేశ్యాగృహం నిర్వాహకురాలి పాత్రలో ఆలియాభట్ అభినివేశం చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. గల్లీబోయ్ లో గల్లీ ప్రేమికురాలిగా అదరగొట్టిన ఆలియా మరో విలక్షణ పాత్రతో ఎలా మెప్పిస్తుందో చూడాలన్న పట్టుదల అందరికీ ఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి హిస్టారికల్ మూవీలో సాఫ్ట్ గా ఉండే సీత పాత్రలో కనిపించినా.. గంగూబాయి అనే వేశ్యాగృహ నిర్వాహకురాలిగా ఎంతో కటువుగా ఉండే పాత్రలో గొప్ప హృద్యమైన ఎలిమెంట్స్ ని ముఖాభినయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. టబు.. నందితా దాస్ లాంటి జాతీయ ఉత్తమ నటీమణులకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ ఆలియా ఎలా వేస్తుంది? అన్నది ఆసక్తికరం.
తాజా సమాచారం ప్రకారం.. గంగూబాయి కతియావాడికి నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. భన్సాలీ బృందం ఈపాటికే డీల్ ని పూర్తి చేశారట. భన్సాలీతో పాటు జయంతిలాల్ గడా ఈ చిత్రానికి నిర్మాతగా పెట్టుబడులు సమకూరుస్తున్నారు.
ప్రఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గంగూబాయి కతియావాడి డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ .150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థియేట్రికల్.. శాటిలైట్ హక్కులను విక్రయించడం ద్వారా మేకర్స్ భారీ లాభాలను ఆర్జించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల కానుంది.