యూఎస్‌ఏలో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ షో.. వాళ్లే ఎక్కువ మంది!

Update: 2022-06-02 14:39 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విడుదల అయిన ప్రతి చోట కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ సినిమా దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ఆర్‌ ఆర్‌ ఆర్ ను జూన్‌ 1వ తారీకున ఒరిజినల్‌ కట్స్ తో యూఎస్‌ఏ లో విడుదల చేయడం జరిగింది.

ఇప్పటికే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్నా కూడా మంచి స్పందన వచ్చింది. అయితే చిత్రమేంటంటే  ఈ సారి తెలుగు వారి కంటే ఫారినర్స్ ముఖ్యంగా స్థానిక అమెరికన్స్ సినిమాను చూసేందుకు వచ్చారట. తెలుగు సినిమాకు ఒక హాలీవుడ్‌ సినిమా రేంజ్ లో అమెరికన్స్ రావడం ఆశ్చర్యంగా ఉందంటూ నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

యూఎస్‌ లో మెజారిటీ తెలుగు వారు ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ చూశారు. ఒక వేళ చూడని వాళ్లు ఉంటే ఓటీటీ లో చూసేసి ఉంటారు. కనుక ఈసారి తెలుగు వారి కంటే అధికంగా స్థానికులు చూడటం జరిగిందటూ కామెంట్స్ వస్తున్నాయి. స్పెషల్‌ షో కు ఇంతగా రెస్పాన్స్ రావడం పట్ల స్థానిక ఎగ్జిబ్యూటర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా స్పెషల్ షో అంటూ సోషల్‌ మీడియాలో ముఖ్యంగా స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లే మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా థియేటర్లలో సందడి చేయడం చూస్తే ఆశ్ఛర్యంగా ఉంది.

రామ్‌ చరణ్ ను అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్‌ ను కొమురం భీమ్ గా ఈ సినిమా లో రాజమౌళి చూపించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా అభిమానులు ఆశించినట్లుగానే విజువల్ వండర్‌ గా ఉంది. అయితే బాహుబలి స్థాయి లో లేదు అనేది మాత్రం చాలా మంది అభిప్రాయం. ఆర్ ఆర్‌ ఆర్ లో కథ లేదని కొందరు అంటే మరి కొందరు హీరోల పాత్ర లు పరిచయం తప్ప మరేం లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News