కొవిడ్ 19 మార్గదర్శకాల్ని అనుసరిస్తూ ఇకపై షూటింగులు చేసుకోవచ్చని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. అయితే ముందుగా టెస్ట్ షూట్ చేసి ఆ వీడియోని పోలీస్ అధికారులకు చూపించాలన్నది నియమం. ఆ ప్రకారమే ముందుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు.
సాధ్యమైనంత తొందరగా షూటింగులు ప్రారంభించేయాలని నిర్మాతల్లో ఆత్రం ఉంది. తొలిగా పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని పూర్తి చేయాలన్న ఆత్రంలో ఉన్న రాజమౌళి త్వరలోనే టెస్ట్ షూట్ కి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరినీ బరిలో దించి షూటింగ్ చేయాల్సి ఉండగా.. ఆ ఇద్దరినీ ఇప్పుడే రమ్మని పిలవడం రిస్క్ అని భావిస్తున్నారట. అలా వచ్చేందుకు హీరోలు కూడా సిద్ధంగా లేరు.
కరోనా మహమ్మారీ సన్నివేశం అంతకంతకు భయపెట్టేస్తోంది. లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితి అదుపు తప్పింది. సింగిల్ డిజిట్ డబులు డిజిట్ ను దాటి ట్రిపుల్ డిజిట్ లో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సన్నివేశంలో స్టార్లను బరిలో దించితే జరగకూడనిది ఏదైనా జరిగినా అది మొత్తానికే మోసం. అందుకే ఆచితూచి ప్లాన్ చేస్తున్నారు. చరణ్- తారక్ బదులుగా డూప్ లను ఉపయోగించి టెస్ట్ షూట్ చేయనున్నారట.
ప్రస్తుతం టెస్ట్ షూట్ కోసం రెడీ అవుతున్న జక్కన్నకు ఇంకా పోలీస్ అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేశారు. అనుమతులు రాగానే షూటింగ్ చేస్తారు. టెస్ట్ షూట్ అవ్వగానే పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. అటు పై రామ్ చరణ్ - ఎన్టీఆర్ తో షూటింగును స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత మహమ్మారీ విజృంభణ సన్నివేశం పోలీసుల్ని పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోందని.. షూటింగులకు అనుమతిస్తే ప్రమాదం ఎలా ఉంటుందోనన్న ఆందోళనా వారిలో వ్యక్తమవుతోందట. అందుకే ఇంకా టెస్ట్ షూట్ అనుమతుల కోసమే జక్కన్న టెన్షన్ గా ఉన్నారట.