#RRR: ఆ న‌లుగురి పారితోషికాలు పీక్స్

Update: 2020-01-30 05:25 GMT
బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత రాజ‌మౌళి మార్కెట్ జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. త‌న స్థాయిని డ‌బుల్ ట్రిపుల్ చేసుకునేందుకు జ‌క్క‌న్న ఈసారి #RRR తో దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఒకే తాటిపై తీసుకొచ్చి మ‌రో భారీ పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తు న్నారు. బాహుబ‌లితో పోలిస్తే ఈసారి ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ డిఫ‌రెంటుగానే ప్లాన్ చేశాడు రాజ‌మౌళి. రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఎందుక‌నో స‌రైన‌ అప్ డేట్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డం అన్న‌ది జ‌క్క‌న్న స్పెషాలిటి. ఎట్టి ప‌రిస్థితిలో లీకులు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఎంత దాచేస్తే అంత‌ బ‌జ్ పెరుగుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

#RRR కి సంబంధించి ప్ర‌తిదీ రాజ‌మౌళి అండ్ టీమ్ ద‌గ్గ‌రుండి చూసుకోవ‌డం ఓ స్పెషాలిటీ. ఇక స్టార్ల పారితోషికాలు స‌హా ప్ర‌తిదీ రాజ‌మౌళి నిర్మాత‌ల‌తో చ‌ర్చిస్తారు. అవ‌స‌రం మేర ఫైనాన్స్ వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న ప్లానింగ్ ఉంటుంద‌ని చెబుతారు. జ‌క్క‌న్న తన ఇమేజ్ ను క్రియేటివ్ ప‌రంగానే కాకుండా...ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా ప‌ర్ పెక్ట్ గా ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌లరు. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి చ‌ర‌ణ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడు? అన్న‌ది ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నాడు. తెర‌పై ఫుల్ లెంగ్త్ రోల్ కాక‌పోయినా క‌థ‌లో కీల‌క స‌మ‌యంలో వ‌చ్చే పాత్ర ఇద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? పాత్ర‌ను బ‌ట్టి జ‌క్క‌న్న అత‌ని రెమ్యున‌రేష‌న్ డిసైడ్ చేసాడా? అంటే అందుకు ఆస్కార‌మే లేద‌ని సోర్సెస్ చెబుతున్నాయి. అజ‌య్ దేవ‌గ‌ణ్ పారితోషికం ఆయ‌న‌కు హిందీలో ఉన్న మార్కెట్ ను బ‌ట్టి మొత్తం సెటిల్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే త‌నాజీ చిత్రంతో అజ‌య్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్నారు. ఈ స‌క్సెస్ #RRR హిందీ వెర్ష‌న్ కు క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ మేర‌కు దేవ‌గ‌న్ నుంచి భారీ డిమాండ్ ఉంద‌ని తెలుస్తోంది. దేవ‌గ‌ణ్ పేరుతో ఒక్క హిందీ పంపిణీ వ‌ర్గాల‌ నుంచే 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాల‌న్న స్ట్రాట‌జీని జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడుట‌. దానికి సంబంధించిన ప‌క్కా గ‌ణాంకాల‌తో ముందుకు వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ సినిమా పారితోషికాల్లో చ‌ర‌ణ్ - తార‌క్ - రాజ‌మౌళి- దేవ‌గ‌ణ్ ల‌కు స‌గం పైగా బ‌డ్జెట్ ని నిర్మాత వెచ్చించాల్సిందేన‌న్న అంచ‌నా అభిమానుల్లో ఉంది. స్టార్లు పారితోషికాల‌తో ప‌ని లేకుండా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే #RRR డీల్ ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News