దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ లు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలైన మోషన్ పోస్టర్స్, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ వీడియోస్ సినిమా పై విపరీతంగా బజ్ క్రియేట్ చేసేసాయి. అందుకే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే లాక్ డౌన్ తర్వాత రాజమౌళి టీమ్ ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించారు. ఈ షూట్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొంటుంది. గతంలో రాజమౌళి చెప్పినట్లుగా అయితే ఈ జనవరి 8న ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదల కావాలి. కానీ కరోనా వలన వాయిదా పడుతూ వస్తుండటంతో విడుదల తేదీని ప్రకటించడం కష్టమే. అయితే ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. ఆర్ఆర్ఆర్ బృందం ఈ సినిమాను వచ్చే దసరాకి విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నారట. అయితే 2022 సంక్రాంతికి వస్తుందని ఇదివరకే చిత్రబృందం చెప్పినప్పటికి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసేస్తున్నారట రాజమౌళి టీమ్. ఇప్పటికే షూట్ శరవేగంగా జరుగుతుండగా.. రాంచరణ్ కి కరోనా పాజిటివ్ రావడం బాధాకరం. అయితే ఎలాగైనా ఆర్ఆర్ఆర్ షూటింగ్ మార్చ్ నెల వరకు పూర్తి చేసి.. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ జక్కన్న విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.