మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు. డెబ్యూ మూవీతోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన వైష్ణవ్.. రెండో సినిమా 'కొండపొలం' తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ క్రమంలో తాజాగా తన మూడో చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను ఆవిష్కరించారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో పంజా వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
న్యూ ఏజ్ లవ్ స్టోరీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ''రంగరంగ వైభవంగా'' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లాంచ్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో 'ఏంటే.. ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్?' అని వైష్ణవ్ అడగ్గా.. 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏమి తీసుకురానక్కర్లేదు తెలుసా..' అని కేతిక చెబుతుంది.
ఈ క్రమంలో 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా..' అని హీరోయిన్ అంటుంటే.. తమ కను రెప్పలను తాకిస్తూ ముద్దు పెట్టుకోవడంతో ఇద్దరి ఫేస్ లను రివీల్ చేశారు. ఎలా ఉందని కేతిక అడుగగా.. నెక్స్ట్ లెవెల్ లో ఉందని వైష్ణవ్ చెప్పడం ''రంగ రంగ వైభవంగా'' టైటిల్ టీజర్ లో కనిపించింది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది.
మెగా అల్లుడు తన మూడో చిత్రానికి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది.బాపినీడు సమర్పిస్తున్న ఈ సినిమాని అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'రంగ రంగ వైభవంగా' చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Full View