యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతూ ఉండగా మరో వైపు సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మారుతి మరియు ప్రభాస్ కాంబో మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్ ఈ నెల రెండవ వారం లేదా కాస్త అటు ఇటుగా ప్రారంభించ అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు సలార్ షూట్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మారుతి సినిమా షూటింగ్ కు జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
ఆ విషయం పక్కన పెడితే ప్రభాస్ సినిమా కోసం మారుతి ఒక అరుదైన ఎపిక్ సెట్టింగ్ ను వేయించాడట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పాత థియేటర్ సెట్టింగ్ ను నిర్మించారట. 1970 కాలం నాటి వాడుకలో లేని థియేటర్ కు సంబంధించి సినిమాలో ప్రధానంగా సన్నివేశాలు ఉంటాయట.
ఆ థియేటర్ పేరు రాజా డీలక్స్. వాడుకలో లేని థియేటర్ కనుక అందులో దెయ్యాలు.. బూతాలు ఉండవచ్చు. ఈ సినిమా హ్రరర్ కామెడీ అంటూ ఇప్పటికే యూనిట్ సభ్యుల ద్వారా లీక్ వచ్చింది. కనుక ప్రభాస్ ఆ థియేటర్ తో ఉన్న అనుబంధం ను సినిమాలో ప్రధానంగా చూపించే అవకాశాలు ఉన్నాయి.
సినిమాలోని మెజార్టీ సన్నివేశాలు మరియు కీలకమైన హర్రర్ సీన్స్ ను థియేటర్ లో చిత్రీకరించబోతున్నారట. కనుకే కాస్త ఎక్కువ ఖర్చు చేసి మరీ ఈ సినిమా కోసం ఆ సెట్ ను నిర్మించారు అంటూ వార్తలు వస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ ఆ సెట్ లోనే ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ప్రభాస్, మారుతి కాంబో మూవీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.