70తో తీశారు.. 100 వస్తే సూపర్‌

Update: 2015-08-16 11:30 GMT
బాహుబలి చరిత్ర తిరగరాసింది. శ్రీమంతుడు రికార్డులన్నీ కొట్టేశాడు. మరి ఇక ముందు రాబోతున్న సినిమాలు ఇంకెలాంటి విజయాల్ని అందుకోవాలి. అందునా తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను సినిమాగా తీశారు గుణశేఖర్‌. సెప్టెంబర్‌ 4న ఈ చిత్రం రిలీజ్‌ కి వస్తోంది. భారతదేశంలోనే తొలి హిస్టారికల్‌ 3డి స్టీరియోస్కోపిక్‌ చిత్రమిది. అనుష్క, రానా, అల్లు అర్జున్‌ లీడ్‌ రోల్స్‌ పోషించారు. దాదాపు 70కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించిన ఈ సినిమా 100కోట్ల వసూళ్ల క్లబ్‌ లో  చేరితేనే విజయం సాధించినట్టు.

అందుకే గుణశేఖర్‌ ప్రమోషన్‌ లో స్పీడ్‌ పెంచారు. ఈ సినిమాని విద్యార్థులు మస్ట్‌ గా చూడాల్సిందే అంటూ ప్రచారం మొదలెట్టారు. కాలేజీలకు, విద్యాసంస్థలకు వెళ్లి రుద్రమదేవి గురించిన పబ్లిసిటీ చేస్తున్నారు. రుద్రమ రథం వస్తోంది. కదిలి రండి అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ రథాన్ని ఫోటో తీయండి, గిఫ్ట్‌ పట్టేయండి.. అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడం సినిమాకి కలిసొచ్చేదేనని అగ్రనిర్మాత, నైజాం పంపిణీదారుడు దిల్‌ రాజు చెబుతున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమాకి ప్రచారం పెద్ద అస్సెట్‌ అవుతుంది.

ఇకపోతే ఇటీవలి కాలంలో ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పొచ్చింది. కేవలం టీవీకే పరిమితం కాకుండా థియేటర్లకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. అందుకే వసూళ్లు అదిరిపోతున్నాయి. ఇది మంచికే అంటూ చెబుతున్నారు. ఇప్పటికే బాహుబలి, శ్రీమంతుడు ఓ రేంజులో సక్సెస్‌ అయ్యాయ్‌ కాబట్టి.. ఆ క్రేజును క్యాస్‌ చేసుకొని రుద్రమదేవి 100కోట్ల క్లబ్‌ లో చేరాలని ఆశిద్దాం.
Tags:    

Similar News