మళ్లీ రుద్రమదేవికి స్లాట్‌ ప్రాబ్లమ్‌

Update: 2015-07-22 04:02 GMT
అప్పుడెప్పుడో రావల్సిన ''రుద్రమదేవి'' సినిమా.. బాహుబలి టైపు లో ఒక నిర్ధిష్టమైన డేటు ను ఫిక్స్‌ చేసుకొని కరెక్టుగా ఈ రోజు వస్తున్నాం అని టైమ్‌ చెప్పలేకపోతోంది. ఇప్పటివరకు ఎన్ని డేట్లు అనుకున్నా వర్కవుట్‌ కాలేదు. సరిగ్గా రిలీజ్‌ చేద్దామనుకున్నప్పుడు అప్పట్లో టైగర్‌ వంటి సినిమాలు అడ్డు తగిలాయ్‌. ఇన్నాళ్ళకు బాహుబలి రిలీజ్‌ అయిపోయి ఆగస్టు వస్తోందిగా అనుకుంటే 7న శ్రీమంతుడు దిగుతున్నాడు. ఇప్పుడెలా?

నిజానికి శ్రీమంతుడు సినిమాకు ముందే రావాలంటే మాత్రం జూలై 24న రావాలి. ఒక ప్రక్కన బాహుబలి ప్రభంజనం ఇంకా తగ్గట్లేదు, మరో ప్రక్కన ఆగస్టు 7 వచ్చేస్తోంది. సో, మధ్యలో వచ్చిన రుద్రమదేవి భారీగా పెర్ఫామ్‌ చేస్తేనే రిజల్ట్‌ ఉంటుంది. లేకపోతే సీన్‌ సితారే. అయితే ఈ డేటుల్లో రుద్రమ డేర్‌ చేయలేకపోతోందని తెలుస్తోంది. ఇకపోతే సెప్టెంబర్‌ నెలలో రావాలి మరి. ఎందుకంటే శ్రీమంతుడు వచ్చిన రెండు వారాల వరకు ఆ పవర్‌ అలాగే ఉంటుంది. అయితే సెప్టెంబర్‌ 17న 'శివం', 24న 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలను తీసుకురావాలని ఇప్పటికే ప్లాన్‌ వేసుకున్నారు. కాబట్టి వస్తే గిస్తే సెప్టెంబర్‌ మొదటి వారంలోనే రుద్రమదేవి రావాలి. అంటే సెప్టెంబర్‌ 4 ఒక్కటే సరైన స్లాట్‌. కాని అప్పుడొస్తే ఎలా ఉంటుంది అని గుణశేఖర్‌ ఆలోచిస్తున్నాడట. ఇలా ఆలోచిస్తూపోతే ఆ స్లాట్‌ కూడా ఎగిరిపోతుందేమో.
Tags:    

Similar News