రుద్రమదేవి పై జనాలకు అంత ఇంట్రెస్టా?

Update: 2015-11-22 19:30 GMT
ఈ ఏడాది తెలుగులో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో ముందు ‘బాహుబలి’ ఉంటే.. ఆ తర్వాత ‘రుద్రమదేవి’ ఉంటుంది. ఐతే తెలుగు ప్రేక్షకులకు ‘రుద్రమదేవి’ సినిమా మీద అంత ఆసక్తి ఉండటంలో, దాని గురించి చర్చించుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దేశమంతా ‘రుద్రమదేవి’ గురించి మాట్లాడుకుందని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఫేస్ బుక్ ఇంటర్నల్ డేటా ప్రకారమైతే ‘రుద్రమదేవి’ మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది.

ఆ చర్చ ఏ స్థాయిలో అంటే.. అక్టోబరు నెలలో ఫేస్ బుక్  ఎంటర్ టైన్ మెంట్ కేటగిరిలో అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో సల్మాన్ సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ తర్వాత రుద్రమదేవిదే రెండో స్థానం. తర్వాతి స్థానాల్లో దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే సంజయ్ మిశ్రా - గులామ్ అలీ - బ్రూనో మార్స్ - దిల్ వాలే లాంటి టాపిక్స్ ఉన్నాయి.

ఇక ‘పీపుల్’ విభాగంలో అత్యంత చర్చనీయాంశమైన టాపిక్స్ లో రుద్రమదేవి అగ్రస్థానంలో ఉండటం విశేషం. గత నెలలోనే రిటైర్ మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి కూడా బాగానే చర్చ సాగింది కానీ.. ఆ టాపిక్ రెండో స్థానానికి పరిమితమైంది. పుతిన్ - అనిరుధ్ - చార్లీ చాప్లిన్ - సూరజ్ బర్జాత్యా - జహీర్ ఖాన్ లకు సంబంధించిన టాపిక్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తానికి గుణశేఖర్ సినిమా మీద దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో చర్చ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే
Tags:    

Similar News