కంగ‌న అంత పెద్ద స్టార్ అవ్వాల‌నుకుందా?

Update: 2021-06-03 02:30 GMT
కంగ‌న స్వ‌స్థ‌లం హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చి తెలుగు -త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో అదృష్టం ప‌రీక్షించుకుంటోంది రుహానీశ‌ర్మ‌. టాలీవుడ్ లో సుశాంత్ స‌ర‌స‌న‌ చి.ల‌.సౌ సినిమాలో న‌టించింది. తొలి ప్ర‌య‌త్న‌మే త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత‌ డ‌ర్టీ హ‌రి- హిట్ ది ఫ‌స్ట్ కేస్ చిత్రంలో ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించింది.  తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌ల‌కు ఇప్ప‌టికే సుప‌రిచితం. కడైసి బెంచ్ కార్తీ అనే త‌మిళ చిత్రం.. క‌మ‌ల అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ రుహానీ నాయిక‌గా న‌టించింది.

బాలీవుడ్ లో ఆగ్రా అనే చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. రుహానీ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో పుట్టి పెరిగింది. చండీగర్  పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. శర్మ మొట్టమొదట పంజాబీ మ్యూజిక్ వీడియోలు `క్లాస్ రూమ్` ..`కుడి తు పటాకా`లలో కనిపించింది. ఆ త‌ర్వాత సినీరంగంలో ప్ర‌వేశించి బిజీ నాయిక‌గా మారుతోంది.

సామాజిక మాధ్య‌మాల్లోనూ ఈ బ్యూటీ స్పీడ్ గానే ఉంది. తాజాగా ఇన్ స్టాలో రుహానీ స్మైలీ లుక్ ని షేర్ చేయ‌గా యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. బ్లాక్ ఫ్రాకులో సంథింగ్ హాట్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. హిమ‌చ‌ల్ బ్యూటీ కంగ‌న అంత పెద్ద స్టార్ అవ్వాల‌నుకుంటోందా? అని కొంద‌రు ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు. త‌దుప‌రి టాలీవుడ్ లో  `నూటొక్క జిల్లాల అంద‌గాడు` అనే చిత్రంలోనూ రుహానీ న‌టిస్తోంది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. ఇందులో అత‌డు బ‌ట్ట‌త‌ల తో ఇబ్బందుల‌కు గుర‌య్యే నేటిత‌రం యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.
Tags:    

Similar News