హిమ‌చ‌ల్ బ్యూటీ టూమ‌చ్ హాట్ లుక్

Update: 2021-06-08 04:30 GMT
హిమానీ న‌దాలు ప్ర‌వ‌హించే చోట ప‌చ్చ‌ని ప్ర‌కృతితో ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన సోల‌న్ వ్యాలీ(సిమ్లా మ‌నాలి స‌మీపం) నుంచి వ‌చ్చి చండీఘ‌ర్ లో స్ట‌డీస్ పూర్తి చేసి అటుపై పంజాబీ చిత్రాల్లో న‌టించి ముంబై ప‌రిశ్ర‌మ‌లో అవకాశాల కోసం ప్ర‌య‌త్నించిన బ్యూటీ రుహానీ శ‌ర్మ‌.

చి.ల‌.సౌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత డ‌ర్టీ హ‌రి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాతో మ‌రింత పాపులారిటీ పెంచుకుంది. ఆ రెండు సినిమాలు త‌న‌కు మంచి పేరు తెచ్చాయి. హిట్ ది ఫ‌స్ట్ కేస్ చిత్రంలోనూ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించింది.  తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌ల్లో కెరీర్ బండిని బిజీగానే న‌డిపించేస్తోంది.

ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డి పాపులారిటీ అమాంతం పెరుగుతోందంటే దానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. రుహానీ సాంప్ర‌దాయ శ‌ర్మాజీల కుటుంబం నుంచి వ‌చ్చినా గ్లామ‌ర్ ఎలివేష‌న్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గదు. ఇన్ స్టా వేదిక‌గా వేడెక్కించే ఫోటోల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. త‌న అభిమానుల‌కు మరింత చేరువ‌గా వెళుతోంది రుహానీ. ఒక్క పెద్ద ఛాన్స్ తో మ‌నాలి (హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్) బ్యూటీ కంగ‌న‌లా ద‌శ తిరిగిపోతుందేమో చూడాలి.
Tags:    

Similar News