విమానంలో ఆమె పక్క సీటులో..

Update: 2017-05-30 10:29 GMT
ఈ మధ్య ఓ విమానంలోకి పాము రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విమానంలో బల్లి ప్రయాణికుల్ని కంగారు పెట్టేసింది. మధుర్‌ బండార్కర్‌ ‘క్యాలండర్‌ గర్ల్స్‌’  సినిమాతో బాలీవుడ్‌ కు పరిచయమైన రూహి సింగ్ కు స్పైస్ జెట్ విమానంలో చేదు అనుభవం ఎదురైందట. తన సీటు కింద బల్లి చేరి.. తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టేసిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రయాణించిన స్పైస్ జెట్ విమాన యాజమాన్యం మీద మండిపడుతూ ఇన్ స్టా గ్రాంలో ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది.

రూహి సింగ్ ఈ మధ్యే ఓ తమిళ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన రూహి.. తిరిగి ముంబయి చేరుకోవడానికి విమానం ఎక్కింది. స్పైస్‌ జెట్‌ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ కొన్నానని.. అత్యవసర సమయంలో తాను ఈ టికెట్‌ కొని.. విమానంలో విశ్రాంతి తీసుకుందామని వెళ్తే.. తాను ఓ బల్లితో కలిసి భయం భయంగా ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఉందంటూ.. విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఈ మాజీ మిస్ ఇండియా ఇన్‌ స్టా గ్రాంలో పోస్ట్ చేసింది.

తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా కిటికీ దగ్గరికెళ్లి.. పైనున్న పైనున్న లగేజ్‌ క్యాబిన్‌ లోకి వెళ్లిపోయిందని.. దీని గురించి తాను విమాన సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది మామూలు విషయమే అన్నట్లుగా వాళ్లు నవ్వుకోవడం తనను షాక్‌ కు గురి చేసిందని ఆమె చెప్పింది. విమానం దిగే వరకు తాము బల్లి విషయంలో ఏం చేయలేమంటూ వాళ్లు చేతులెత్తేశారని ఆమె తెలిపింది. రూహి వీడియోపై స్పైస్ జెట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News