'బొంగు' కోసం చెన్న‌య్ వ‌చ్చింది

Update: 2015-11-23 13:30 GMT
ముంబై నుంచి ఎంద‌రో భామ‌లు సౌత్‌ కి వ‌స్తుంటారు. కొంద‌రైతే ఇలా వ‌చ్చి అలా గోడ‌కు కొట్టిన బంతిలా వెన‌క్కి వెళుతుంటారు. ఒక్కోసారి వ‌చ్చిన‌వాళ్లు ఇక్క‌డ నిల‌దొక్కుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి.. గ్లామ‌ర్‌ - ఛ‌రిష్మా - పెర్ఫామెన్స్‌ తో పాటు ల‌క్ కూడా క‌లిసొస్తే ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంటుందిక్క‌డ‌. అలా ఇప్ప‌టికే ఇలియానా - త‌మ‌న్నా లాంటి ముద్దుగుమ్మ‌లు టాలీవుడ్‌ లో పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే బాట‌లో మ‌రో ముంబై ముద్దుగుమ్మ సౌత్‌ లో అడుగుపెడుతోంది. ముందుగా కోలీవుడ్‌ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ఎటెంప్ట్ చేస్తోంది.  అమ్మ‌డి పేరు రుహీ సింగ్‌. మొద‌టి సినిమా టైటిల్ 'బొంగు'. డెబ్యూ డైరెక్ట‌ర్ తాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

రుహీ అందాల పోటీల నుంచి, ముంబై ర్యాంపు నుంచి వ‌స్తున్న భామ‌. మిస్ యూనివ‌ర్శ‌ల్ పీస్ అండ్ హ్యూమానిటీ-2014 విన్న‌ర్‌ గా ముంబై స‌ర్కిల్స్‌ లో పాపుల‌ర్ అయ్యింది. అటుపై సామాజిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌ధుర్ భండార్క‌ర్ దర్శ‌క‌త్వం వ‌హించిన క్యాలెండ‌ర్ గాళ్స్ చిత్రంలో ఒకానొక క‌థానాయిక‌గా న‌టించింది. అయితే మొద‌టి సినిమానే ఫ్లాప‌వ్వ‌డంతో ఈ అమ్మ‌డు సౌత్ సినిమాల వైపు దృష్టి సారించింది. ఇట్నుంచి న‌రుక్కొస్తే అక్క‌డ ప‌ని వీజీ అయిపోతుంద‌నేది రుహీ ప్లాన్‌. అయితే ఈ అమ్మ‌డి ఎటెంప్ట్ ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస‌వుతుందో చూడాలి. ఎలానూ కోలీవుడ్‌ లో అడుగుపెడుతోంది కాబ‌ట్టి మునుముందు టాలీవుడ్‌ లోనూ ఈ అమ్మ‌డి హ‌వా సాగుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. ప్ర‌స్తుతానికైతే బొంగు .. లో ఆఫ‌ర్ అందుకుంది, అద‌న్న‌మాట‌.
Tags:    

Similar News