టాలీవుడ్ లో టైం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో చెప్పడం కష్టం. ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్లు ఒక్క సినిమాతో స్టార్లు అయిపోతారు. నిన్నటి దాకా దివ్యంగా వెలిగిన కథా నాయికలు అవకాశాలు లేక ఏజ్ బార్ హీరోలతో కూడా జట్టు కట్టడానికి ఓకే చెబుతారు. ఇలా జరగడం పూర్తిగా ట్రాక్ రికార్డు మీద ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ అదే నమ్మకం మీదే ఉంది. నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం వర్క్ అవుట్ కాకపోవడంతో ఆశలన్ని అల్లు శిరీష్ ఏబిసిడి మీదే పెట్టుకుంది. మలయాళం బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. నిజానికి తన మొదటి సినిమా నానిది కాదు. ఆకతాయితోనే ఎంట్రీ ఇచ్చింది కానీ అది డిజాస్టర్ కావడంతో పాటు కొత్త హీరో మూవీ కనక ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మెగా కాంపౌండ్ హీరో కాబట్టి ఏబిసిడి హిట్ అయితే గుర్తింపు వస్తుందనే ఆశతో ఉంది.
గ్లామర్ కే ఎక్కువ గుర్తింపు ఉన్న పరిశ్రమలో రుక్సర్ కు ఏబిసిడిలో దక్కింది సోషల్ యాక్టివిస్ట్ పాత్ర. పెర్ఫార్మన్స్ పరంగా స్కోప్ ఉంటుంది కానీ అందాలు ఆరబోయడానికి ఛాన్స్ ఇవ్వదు. అలాంటిది రుక్సర్ కోరిక ఎంత వరకు నెరవేరుతుంది అనేది ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఇప్పుడిప్పుడే గట్టి హిట్స్ కోసం ట్రై చేస్తున్న అల్లు శిరీష్ మూవీ కాబట్టి అతనికీ ఈ విజయం చాలా అవసరం. రుక్సర్ మాత్రం ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంది. ఆల్రెడీ ప్రూవ్ ఆయిన సబ్జెక్ట్ కనక హిట్ ఖాయమనే ధీమాలో ఉంది. కన్నడలో గతంలో రెండు సినిమాలు చేసిన ఈ బెంగుళూరు బ్యూటీ తెలుగులో సెటిల్ అయిపోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది.