హలో సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు చాలా కోరుకుంటోంది. అఖిల్ స్టార్ హీరో అవ్వాలని నాగార్జున తనకు తెలిసిన ఆలోచనలను మొత్తం సినిమా ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ సినిమాకు ఓ టాక్ మాత్రం ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
సినిమాకి ప్రధానంగా కథ ఎంత అవసరమే అలాగే టేకింగ్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని నాగార్జున పడే పదే చెబుతున్నారు. ఇక సినిమాను వెంటాడుతున్న ఒక నెగిటివ్ టాక్ ఏమిటంటే.. సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక సెల్ మాఫియా తరహాలో తెరకెక్కిన 'సెల్యులార్' అనే ఇంగ్లీష్ సినిమా ఆధారంగా చేసుకొని దర్శకుడు కథ రాసుకున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి.
2005లో వచ్చిన సెల్యులార్ సినిమాలో కిమ్ బెసింగర్ అండ్ క్రిస్ ఎవాన్స్ నటించారు. అయితే ఆ సినిమాలో కిడ్నాప్ అయిన ఒక వృద్ధురాలు ఒక యువకునికి ఎమర్జెన్సీ కాల్ చేస్తుంది. ఇక హలో సినిమాలో హీరోయిన్ కాల్ కోసం హీరో ఎదురుచూస్తూ ఉంటాడు. ఆమెను కూడా ఒక మొబైల్ దొంగతనం చేసే ముఠాల చేతిలో కిడ్నప్ అవుతుందా మరి? ఇక ట్రైలర్ లో చూపించినట్టుగా ట్రక్ లో చాలా మొబైల్స్ కిందపడటం చూస్తుంటే.. సదరు హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు.
మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని విక్రమ్ కె కుమార్ గత సినిమాలను చూసుకుంటే అన్ని లాజిక్స్ తో కూడుకున్న మైండ్ గేమ్స్ కథల్లా ఉంటాయి. అతని టేకింగ్ కూడా చాలా బావుంటుందని చెప్పవచ్చు. హలో సినిమా ఎలా ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక నిర్దారణకు రాకూడదనే చెప్పాలి. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో..