ఎన్టీఆర్‌ ను ఆపాలనే ప్లాన్‌ ఉందట

Update: 2016-01-07 03:52 GMT
ఇప్పటివరకు ఎన్టీఆర్‌ ''నాన్నకు ప్రేమతో'' చేస్తున్న హడావుడే చూశాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం యవ్వారంలో మరో ఆపోజిట్‌ యాంగిల్‌ కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ కు సపోర్టు ఇచ్చిన వారే మనోడి సినిమాను ఆపాలని చూస్తున్నారని టాక్‌.

ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. ''ఏమయ్యా టెంపర్‌ సినిమా ఫిబ్రవరిలో రాలేదా? అది ఆఫ్‌ సీజన్‌ కాదా? అయినా కూడా 42 కోట్లు పైనే షేర్‌ వచ్చిందిగా? అలాంటప్పుడు మీకు సంక్రాంతి ఎందుకు? ముగ్గురం తినాలి ఇప్పుడు. మాకు వదిలేయొచ్చుగా'' అన్నారట. ఇదే ఉద్దేశ్యం చాలామందికి ఉంది. అందుకే ఎన్టీఆర్‌ సెన్సార్‌ కార్యక్రమాన్ని కనుక ఒక రెండు మూడు రోజులు లేటు చేయిస్తే హ్యాపీగా మనోడి సినిమా పై వచ్చే వారానికి పోస్టు పోన్‌ అవుతుంది. ఆ తరహాలో కొందరు ఆలోచిస్తున్నారని ఇప్పుడు ఫిలిం నగర్‌ టాక్‌.

ఇదంతా ఒకెత్తయితే.. అసలు ఇంతవరకు ఫైనల్‌ కట్‌ రెడీ కాలేదని మరో టాక్‌ నడుస్తోంది. అక్కడ చెన్నయ్‌ లో దేవిశ్రీప్రసాద్‌ రాత్రింబవళ్ళూ నిద్ర లేకుండా జాగారం చేస్తూ సినిమాను ఫినిష్‌ చేస్తున్నాడట. డెడ్‌ లైన్‌ అందుకోవాలి కాబట్టి.. మూడు షిఫ్టులూ పనిచేస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో...
Tags:    

Similar News