రన్.. పిచ్చెక్కించేస్తున్నారుగా

Update: 2016-02-28 04:34 GMT
నేరం అనే తమిళ హిట్ సినిమాకు రీమేక్ అట.. మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకుడట.. సందీప్ కిషన్ - అనీషా ఆంబ్రోస్ హీరో హీరోయిన్లట.. తమిళ నటుడు బాబీ సింహా విలన్ అట.. అని ‘రన్’ సినిమాకు సంబంధించి ముందు వార్తలు వచ్చినపుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాకు టైటిల్ పెట్టడం కోసం కాంటెస్టు పెట్టినపుడు కూడా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదలడం ఆలస్యం.. జనాల్లో ఉన్నట్లుండి ఆసక్తి మొదలైంది. తర్వాత క్యారెక్టర్స్ టీజర్ అంటూ వెరైటీగా వదిలిన అర నిమిషం టీజర్ మరింతగా ఆసక్తిని పెంచింది.

లేటెస్టుగా వచ్చిన కాన్సెప్ట్ టీజర్ ‘రన్’ మీద అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. టైం బాగున్నపుడు ఎలా ఉంటుంది.. టైమ్ బ్యాడ్ అయితే ఏమవుతుంది.. అంటూ సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు ఈ లేటెస్ట్ టీజర్లో. ఓ పక్క ఆహ్లాదం.. మరోపక్క ఉత్కంఠ.. మొత్తానికి ఈ సినిమాలో ఏదో ఉందన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయి. తమిళంలో సినిమా కొంచెం డల్ గా - స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. తెలుగులోకి వచ్చేసరికి ఒక ఊపు కనిపిస్తోంది. టీజర్ చివర్లో స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్.. ‘టైం’ అని వేయడం విశేషం. మార్చి 23న ఈ ‘రన్’ కోసం రెడీగా ఉండండంటూ ఊరించారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.
Full View

Tags:    

Similar News